వాస్తు: ఇంటర్వ్యూ లో విజయం సాధించాలంటే ఇలా చెయ్యండి..!

ఎంత కష్టపడుతున్నా ఇంటర్వ్యూలో విజయం సాధించలేక పోతున్నారా…?, ప్రిపేర్ అయినప్పటికీ
ఇంటర్వ్యూ వరకు వచ్చి ఊడిపోతున్నారా..? అయితే వాస్తు శాస్త్రం ప్రకారం పండితులు చెబుతున్న ఈ చిట్కాలను పాటించండి. ఈ చిట్కాలను కనుక అనుసరించారు అంటే తప్పకుండా ఇంటర్వ్యూలో విజయం సాధించగలరు.

సాధారణంగా ఇంటర్వ్యూ అంటే కాస్త టెన్షన్ గా ఉండడం.. ఇబ్బందిగా ఉండటం సహజం. ఎంతో నమ్మకంగా వెళ్ళినా ఒక్కొక్కసారి ఇంటర్వ్యూలో విజయం సాధించలేక పోతాము. అక్కడ సాధించలేక వెనక్కి వచ్చేసే దుస్థితి వస్తుంది. మీరు కూడా ఇలా ఇబ్బంది పడుతూ ఉంటే కచ్చితంగా ఈ చిట్కాలు ఫాలో అవ్వండి. ఈ విధంగా కనుక ఫాలో అయ్యారంటే కచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది.

ఈరోజు మన పండితులు ఇంటర్వ్యూలో ఎలా విజయం సాధించాలి అనే విషయాన్నీ చెప్పడం జరిగింది. మరి దాని కోసం చూసేస్తే… పసుపు రంగు జేబురుమాలుని తీసుకుని ఇంటర్వ్యూ కి వెళ్ళేటప్పుడు జేబు లో పెట్టుకుని వెళ్ళమన్నారు. లేదా పసుపు రంగు క్లాత్ ని అయినా సరే పట్టుకుని వెళ్ళండి. ఇలా చెయ్యడం వలన మీరు మీరు చక్కటి ఫలితాలు పొందవచ్చునని పండితులు అంటున్నారు. అలానే రెండు పసుపుకొమ్ములు కూడా మీరు మీ జేబులో వేసుకుని వెళ్ళండి. ఇలా ఈ విధంగా మీరు ఇంటర్వ్యూ కి వెళితే తప్పక శుభం కలుగుతుంది.