వాస్తు: నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుంచి తొలగిపోవాలంటే ఇలా చేయండి…!

సాధారణంగా కొన్ని కొన్ని సార్లు మన ఇళ్ళల్లో చిన్న చిన్న గొడవలు, మాట మాట రావడం లాంటివి జరుగుతుంటాయి. అటువంటి సమయం లో నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం పండితులు కొన్ని విషయాలను తెలియజేశారు. ఈ విషయాలని కనుక పాటిస్తే ఆ చిన్న చిన్న సమస్యలు ఇంట్లో నుంచి వెళ్లిపోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.

మరి ఎటువంటి ఆలస్యం లేకుండా దాని కోసం పూర్తిగా చూసేయండి.. వాస్తు శాస్త్రం ప్రకారం పండితులు నెగిటివ్ ఎనర్జీ ని ఇంట్లో నుండి బయటకు పంపాలంటే ఒక చిన్న ఉపాయాన్ని చెప్పారు. అదేమిటంటే కొవ్వొత్తుల తో నెగిటివ్ ఎనర్జీని తొలగించడం.

ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల కొవ్వొత్తుల మనకి దొరుకుతున్నాయి. పైగా వాటిలో వివిధ రకాల స్టైల్స్ మరియు రంగులు కూడా ఉన్నాయి. వాటిని కనుక మనం ఇంట్లో వెలిగించామంటే ఎంతో అందంగా ఉంటుంది మన ఇల్లు. దీనితో ఏమవుతుందంటే ఆనందం కూడా అక్కడ ఉంటుంది.
ఇలా కొవ్వొత్తులని కొని ఇంట్లో వెలిగించడం వల్ల ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది.

కొవ్వొత్తులు నెగటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. పండితులు కొవ్వొత్తుల ద్వారా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ వస్తుందని అంటున్నారు. అయితే కొవ్వొత్తులు వెలిగించినప్పుడు మాత్రం ఈ ఒక్క విషయాన్ని మర్చిపోకూడదు.

అదేమిటంటే..? కొవ్వొత్తులు వెలిగించేటప్పుడు తూర్పువైపున లేదా దక్షిణం వైపు మరియు వాయువ్యం వైపు ఉంచొచ్చు. ఇలా చేయడం వల్ల ఆనందం కలుగుతుందని ఇంట్లో ఉండే నెగిటివిటీ పూర్తిగా దూరం అవుతుందని అంటున్నారు.