దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప్రస్తుతం భారీ ఎత్తున కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ ప్రభావం మొదలయ్యాక తొలిసారిగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 3 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే కోవిడ్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే కర్ణాటకలో కోవిడ్ పరిస్థితి అదుపు తప్పిందని ఆ రాష్ట్ర సీఎం యడ్యూరప్ప వ్యాఖ్యానించారు.
కర్ణాటకలో పరిస్థితులు అదుపు తప్పాయి. నియంత్రించలేని స్థితి వచ్చింది. కోవిడ్ వల్ల పరిస్థితులు మారిపోయాయి. ప్రతి కుటుంబంలో ముగ్గురి నుంచి నలుగురు కోవిడ్ బారిన పడ్డారు. మాస్కులను ధరించాలని, శానిటైజర్లు వాడాలని, సోషల్ డిస్టన్స్ పాటించాలని మోదీ చెప్పారు. అంతకు మించి కోవిడ్‌ను కట్టడి చేసేందుకు వేరే మార్గం కనిపించడం లేదు. అని యడ్యూరప్ప అన్నారు.
చేతులు జోడించి అడుగుతున్నా. అత్యవసరం అయితే తప్ప మీరు మీ ఇళ్ల నుంచి బయటకు రాకండి. పరిస్థితులు రోజు రోజుకీ దిగజారిపోతున్నాయి. కోవిడ్ పరిస్థితి అదుపు తప్పింది. అని యడ్యూరప్ప అన్నారు. కాగా సీఎం యడ్యూరప్పకు తాజాగా రెండోసారి కోవిడ్ బారిన పడ్డారు. దీంతో ఆయన్ను హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందించారు. కోవిడ్ నుంచి ఆయన కోలుకున్నాక ప్రజలకు ఆయన పై విధంగా విజ్ఞప్తి చేశారు.