వాస్తు టిప్స్: ఇల్లు కడుతున్నారా? ఐతే ఖాళీ స్థలం ఏ దిశగా వదులుకుంటే బాగుంటుందో తెలుసుకోండి.

-

ఇల్లు కట్టే ముందు వాస్తు శాస్త్రజ్ఞులతో చర్చలు జరిపి ఎలా కడుతుందో ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుంటుందనే విషయాలు తెలుసుకుంటారు. వాస్తుని నమ్మే ప్రతీ ఒక్కరూ దీన్ని పాటిస్తారు. కొత్తగా తయారయ్యే ఇల్లు వాస్తు ప్రకారంగా అన్ని విధాలుగా బాగుండాలని, దానివల్ల ఆ ఇంట్లో ఉన్నవారికి శుభం జరగాలని ఆలోచిస్తారు. ఎక్కడ కిటీకీ ఉంటే బాగుంటుందన్న దగ్గర నుండి ఎక్కడ బాత్రూమ్ ఉండాలన్న వరకు వాస్తు శాస్త్రం చెబుతుంది. అదే కాదు వాస్తు ప్రకారంగా ఇంట్లో ఉన్న వస్తువులు ఏ పక్కన ఉండాలి? ఆ వస్తువుల రంగులు ఏ రంగులో ఉంటే మంచిదన్న విషయాలు కూడా చెబుతారు.

ఈ విషయాలు నమ్మని వాళ్ళు ఎలాగో నమ్మరు. ఐతే వాస్తు శాస్త్రాన్ని నమ్మేవాళ్ళు వీటిని తప్పక ఆచరిస్తారు. ప్రస్తుతం మనం తెలుసుకోబోయేది ఏమిటంటే, కొత్తగా ఇల్లు కడుతున్నప్పుడు ఉండే ఖాళీ స్థలాన్ని ఏ దిక్కులో వదులుకోవాలి అని. ఏ దిక్కులో ఖాళీ స్థలం వదులుకుంటే ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుంటారనేది ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు నిపుణుల ప్రకారం ఇల్లు కడుతున్నప్పుడు తూర్పు దిక్కున ఖాళీ స్థలాన్ని వదిలేసుకోవాలని చెబుతున్నారు.

తూర్పు దిక్కున గుమ్మం చేసుకుని ఇల్ల కడుతుంటే తూర్పు భాగంలో, ఉత్తర భాగంలో ఖాళీ స్థలం వదిలేసుకుంటే బాగుంటుందట. ఈశాన్యంలో అయినా ఫర్వాలేదని అంటున్నారు. దీనివల్ల ఆ ఇంట్లో నివసించే వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తవట. అందుకే ఇల్లు కట్టేటపుడు తూర్పు దిక్కున గుమ్మం చేసుకోవాలని చూస్తుంటారు. ఐతే మార్కెట్లో ఇలాంటి స్థలాలకి చాలా డిమాండ్ ఉంటుంది. సాధారణం కన్నా వీటి ధర ఎక్కువగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news