వాస్తు: ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటుంది….!

ఈరోజు వాస్తు పండితులు వాస్తు శాస్త్రానికి సంబంధించిన కొన్ని విషయాలు మనకు షేర్ చేసుకున్నారు. భార్య, భర్తల మధ్య ప్రేమ ఉండాలి అంటే ఈ చిన్న పద్ధతిని అనుసరించమని వాస్తు పండితులు అంటున్నారు. భార్య, భర్తల మధ్య ప్రేమ ఆనందం లేకపోతే వాళ్ల బెడ్ రూమ్ లో రెండు ఏనుగులని పెట్టడం వల్ల మంచి జరుగుతుందని చెప్తున్నారు.

ఇలా ఏనుగు బొమ్మలని బెడ్రూం లో ఉంచడం వల్ల వాళ్ళ మధ్య ప్రేమ, గౌరవం పెరుగుతుందని వాళ్ళిద్దరి మధ్య సంతోషంగా ఉంటుందని చెప్తున్నారు. అదే విధంగా బెడ్ రూమ్ తలుపు కి రెండు ఏనుగుల మధ్య లో లక్ష్మీ దేవి ఉన్న పెయింటింగ్ వేయడం వల్ల కూడా మంచి ఉంటుందని అంటున్నారు.

బెడ్ రూమ్ కి డార్క్ కలర్స్ కాకుండా క్రీమ్ కలర్ లేదా ఆఫ్ వైట్ రంగు వేస్తె కూడా మంచిదని అంటున్నారు. దీనివల్ల ఆనందం ఉంటుందని అన్నారు. అలానే ఆర్ధికంగా కూడా ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవని పండితులు అంటున్నారు.

కాబట్టి మీ ఇంట్లో భార్య భర్తల మధ్య ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా… సంతోషం కలగాలన్నా ఈ పద్దతులని అనుసరించండి. దీంతో భార్య భర్తలు ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు మరియు చిన్నపాటి తగాదాలు లేకుండా నిత్యం సంతోషంగా ఉంటారు.