ఈ ఉద్యోగులకి ఊరట.. ఎందుకంటే…?

-

కరోనా అందర్నీ ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. ఈ మహమ్మారిని కంట్రోల్ చేయడం చాల కష్టంగా మారింది. ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ నేపథ్యం లో ఐటీ కంపెనీలు వారి ఉద్యోగులకు ఊరట కలిగిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే… కంపెనీలు ఎంప్లాయీస్‌ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయి. వేతన చెల్లింపు తో కూడిన సెలవులు ఇస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా కోవిడ్ 19 పాజిటివ్ వచ్చిన ఉద్యోగులకు 21 రోజులు సెలవులు ఇస్తోంది. జీతం కూడా కట్ చెయ్యడం లేదు. ఇలా ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు మంచి సదుపాయాలని కల్పిస్తోంది. అదే విధంగా విప్రో సహా ఇతర ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ఉచిత వైద్యం అందిస్తున్నాయి.

టెస్టింగ్ ల్యాబ్స్‌ తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం, ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడర్ల తో జతకట్టడం వంటివి చేస్తున్నాయి. ఉద్యోగులకి ఇబ్బంది రాకూడదు అని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్యం కోసం ఇన్ఫోసిస్ కంపెనీ 242 పట్టణాల్లో 1490 హాస్పిటల్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అలానే వ్యాక్సిన్ వేయించుకోమని కంపెనీ చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news