వాస్తు టిప్‌.. లాఫింగ్‌ బుద్ధాతో మీ ఇంటికి సంతోషం!

వాస్తు శాస్త్రం ప్రకారం లాఫింగ్‌ బుద్ధాతో మీ ఇంటికి సంపద పెరుగుతుంది. లాఫింగ్‌ బుద్ధా అంటేనే సంపదను మోసుకొచ్చే విగ్రహాం. ఇది మనకు విజయాన్ని తెచ్చిపెట్టడంతోపాటు సుఖసంతోషాలను పెంచుతుంది. ఈ బొమ్మను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇళ్లంతా సంతోషంతో కూడిన వైబ్రేషన్స్‌ పెరుగుతాయి. సాధరణంగా నవ్వే వ్యక్తులను చూస్తేనే ఆటోమెటిక్‌గా మన మొహంలో కూడా చిరునవ్వు వస్తుంది.

 

ఈ బొమ్మ ఇళ్లలో, ఆఫీసుల్లో మనం చూస్తూనే ఉంటాం. గుండ్రటి మొఖం, పెద్ద పొట్ట, నవ్వుతూ కనిపిస్తుంది. ఈ బొమ్మ ఎక్కడుంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుందని నమ్మకం. జపాన్, చైనా దేశాల్లో లాఫింగ్‌ బుద్ధాకు చాలా క్రేజ్‌ ఉంది. వివిధ రూపాల్లో ఉండే లాఫింగ్‌ బుద్ధాను పెట్టుకుంటే సంపద కలిసి వస్తుందని నమ్మకం. ఒక్కో విగ్రహాం ఒక్కో విధంగా ఫలితాన్ని ఇస్తుందంటారు. అందులో ఈ బొమ్మ బంగారు బంతుల్ని ఎత్తుకుని ఉన్న బొమ్మ పెట్టుకోవడం వల్ల మీ ఇంట్లో ఆరోగ్యంతో పాటు దీర్ఘాయుష్షు ఉంటుంది. బంగారు నాణెలపై కూర్చున్న లాఫింగ్‌ బుద్ధా వల్ల అదృష్టానికి అవధులు ఉండవు అంటారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. తాబేలు మీద కూర్చున్న విగ్రహం వల్ల మీ కెరీర్‌ విజయవంతంగా నడుస్తుంది.

పిల్లల్ని ఎత్తుకుని ఉన్న ట్లు కనిపించే లాఫింగ్‌ బుద్ధాతో ఆ ఇంట్లో పిల్లల అభివృద్ధికి సహాజపడుతుంది. ఇంకా క్రిస్టల్‌తో తయారు చేసిన విగ్రహాం వల్ల జ్ఙానాన్ని పెంచుతుంది. అందుకే దీన్ని స్టడీరూం లో పెట్టాలి. అదేవిధంగా ఇంట్లో ఉండే నెగిటివిటీని తొలగిస్తుందని నమ్మకం.

లాఫింగ్‌ బుద్ధా అంటే బుద్ధుడికి ప్రతీక. ఈ బొమ్మను మీ మెయిన్‌ గేట్‌ ఎదురుగా పెడితే మీ ఇంటికి వచ్చే వారు చిరునవ్వులు చిందిస్తారు. అదే విధంగా ఆ ఇంట్లో వారు కూడా నవ్వుతూ ఎల్లప్పుడు ఆనందంగా ఉంటారు. అలాగే, వారికి ఎటువంటి ఆర్థిక సమస్యలు రావని వాస్తు శాస్త్రంలో వివరించారు.