మాఘమాసంలో ఏ వ్రతం ఆచరించాలి?

-

మాసాలలో ప్రతిమాసానికి ఒక ప్రత్యేకత ఉంది. అందులో కొన్నిమాసాలను పరమ పవిత్రంగా ఆయా శాస్ర్తాలు చెప్పాయి. వీటిలో ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం చాలా ముఖ్యం. దీనిలో ఆషాఢం దక్షణాయన ప్రారంభ, తొలి ఏకాదశితో పండుగల పరంపర ప్రారంభం. చాతుర్మాస్య దీక్షకు ప్రతీక. ఇక రెండోది కార్తీకం దీపారాధన, శివారాధన, వనబోజనాలకు ప్రసిద్ధి. ఇక మూడోది మాఘం.

Which vratam to perform in maghanasam?

ఇది త్రిమూర్తులకు ప్రీతికరం. దీనిలో ప్రధాన విధులు సముద్ర/నదీ లేదా సంగమ స్నానం. రెండోది వ్రతం ఆచరించడం చాలా ముఖ్యం. అయితే ఏ వ్రతం చేయాలి.. దీనికి ప్రమాణం శ్రీ సత్యనారాయణస్వామి వ్రతంలో మొదటి అధ్యాయంలో చెప్పినట్లు మాఘమాసంలో శ్రీ సత్యనారాయణ వ్రతం చేయడం అత్యంత విశేషం. అయితే చాలా మంది కార్తీకంలో సత్యనారాయణ వ్రతం చేయాలన్న నానుడి పడిపోయింది.

కానీ వ్రతకథలోని అయిదు అధ్యాయాలలో మొదటి కథలో భగవాను వాచలో అంటే శ్రీహరి, నారదమునికి చెప్పిన విశేషాల్లో శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని మాఘమాసంలో చేయడం విశేషం అని చెప్పారు. కాబట్టి ఈ మాసంలో మీకు అనుకూలమైన రోజు చూసుకొని స్వామి చెప్పిన విధంగా సాయంత్రం గోధూళి వేళలో అంటే సాయంత్రం ప్రారంభకాలంలో ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరిస్తే చాలు. ఒకవేళ మీకు వ్రతం చేయడానికి శక్తి లేకుంటే భక్తితో స్వామి వ్రత కథను శుచితో దేవుని గది ముందు కూచోని చదువుకోండి తప్పక విశేష ఫలితం వస్తుంది.

వీలు ఉన్నవారు యథావిధిగా మీ శక్తానుసారం వ్రతం ఆచరించండి, దానాలు, ధర్మాలు చేయండి విశేష ఫలితాలు లభిస్తాయి. ఇది స్కాందపురాణంలో చెప్పిన విషయాలు. తప్పక ఆచరించి మీ భాదల నుంచి విముక్తి పొందండి. కలియుగంలో శ్రీహరి అంటే స్థితికారకుని అనుగ్రహం పొందడానికి సులువైన మార్గం. కామితార్థాలను నెరవేర్చుకోండి. జై శ్రీమన్నారాయణ.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version