శ్రీరామనవమి రోజున ప్రతీ ఇంట్లో పానకం ఉంటుంది. మతాలతో సంబంధం లేకుండా పానకం తయారు చేసుకుంటూ ఉంటారు. పానకాన్ని చాలా మంది ఇష్టంగా సేవిస్తారు. రామాలయాల్లో సహా అనేక ప్రాంతాల్లో పానకం ని ఎక్కువగా అందుబాటులో ఉంచుతారు. దాదాపు అన్ని దేవాలయాల్లో కూడా పానకం అందుబాటులో ఉంటుంది. అలాగే వడపప్పు కూడా ప్రసాదంగా ఆ రోజు స్వీకరిస్తూ ఉంటారు.
అసలు పానకం వడపప్పు ప్రాముఖ్యత ఏంటో ఒక్కసారి చూద్దాం. దీని వెనుక పరమార్ధం ఉంది. వేసవికాలం కాబట్టి, వీటిని ప్రసాద రూపంలో సేవించడ౦తో మనుషుల ఆరోగ్యం, ఆయుష్షు అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితులు చెప్తూ ఉంటారు. మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే అంటున్నారు. వడపప్పు – పానకంకి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది.
శరదృతువు, వసంత రుతువులు యముడి కోరల్లాంటివని దేవీభాగవతం చెబుతోందట. ఈ రుతువులో వచ్చే కొన్ని గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని చరిత్ర చెప్తుంది. పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైందని చెప్తూ ఉంటారు. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేయడమే కాకుండా…
జీర్ణశక్తిని వృద్ధిచేస్తుందని చెప్తున్నారు. అదే విధగా దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీకగా చెప్తున్నారు. పెసరపప్పును ‘వడ’పప్పు అని అంటూ అంటారు. అంటే మండుతున్న ఎండల్లో ‘వడ’ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని దాని అర్ధం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనదని… పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనదని చరిత్ర చెప్తుంది. కాబట్టి నమ్మకం ఉంటే తప్పక సేవించండి.