షష్ట గ్రహ కూటమిలో సూర్యగ్రహణ వల్ల ఏం జరుగబోతుందో తెలుసా ?

-

డిసెంబర్‌ 26 అమావాస్యనాడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈసారి ప్రత్యేకత గ్రహణం ఏర్పడే రాశిలో షష్టగ్రహ కూటమి ఉండటం. దీనివల్ల కొందరికి ఖేదం, మరికొందరికి మోదం కలుగుతుంది. జ్యోతిషులు చెప్పిన వివరాలు తెలుసుకుందాం…డిసెంబరు 26న ఏడాదిలో చిట్టచివరి, సంపూర్ణ సూర్యగ్రహణం.

మూల నక్షత్రం ధనుస్సు రాశిలో ఏర్పడనున్న సూర్యగ్రహణం. దేశవ్యాప్తంగా కనువిందు చేయనున్న కేతుగ్రస్త కంకణాకార గ్రహణం 2019లో చిట్టచివరి, మూడో సూర్యగ్రహణం డిసెంబరు 26న గురువారం సంభవించనుంది. ఇది డిసెంబరు 26 గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై 11.10 వరకు కొనసాగుతుంది. మూల నక్షత్రం మకర , కుంభ లగ్నాలలో ధనుస్సు రాశిలో త్రిపాదాధిక కేతుగ్రస్త కంకణాకార సూర్య గ్రహణం ఏర్పడుతుంది. భారత కాలమానం ప్రకారం స్పర్శ కాలం ఉదయం 8 గంటల 9 నిమిషాలకు ప్రారంభం కాగా, మధ్యకాలం ఉదయం తొమ్మిది గంటల 31 నిమిషాలు, మోక్ష కాలం ఉదయం 11.11 నిమిషాలకు అవుతుంది. మొత్తం పుణ్యకాలం సమయం మూడు గంటల రెండు నిమిషాలు. ఈ గ్రహణం భార‌తదేశం, శ్రీలంక‌, కొన్ని గ‌ల్ఫ్ దేశాలు, సుమ‌త్రా, మ‌లేషియా, సింగ‌పూర్‌ల‌లో కనువిందు చేయనుంది. ఇలాంటి సంపూర్ణ సూర్యగ్రహణం మ‌రో 16 ఏళ్లు తర్వాత సంభవిస్తుంది.

ధనుస్సులో గ్రహణం

ధనస్సురాశి ద్వంద్వ రాశి. అగ్ని తత్వ రాశి. రాశి అధిపతి గురుడు. అందులోనే శని కేతువులతో కలిసి ఉండడం ధనస్సురాశి లోకి రవి సంక్రమణం వలన అస్తంగత్వం చెందడం, అదే సమయంలో గండాంత నక్షత్రం మీద సూర్య గ్రహణం ఏర్పడడం కొంత చికాకు, ఆందోళన, ఒత్తిడి కలిగించే అంశం. రవి, శని ఒకే రాశిలో ఉండటం కూడా వ్యతిరేకమైన ఆలోచనలను రేకెత్తించే అవకాశం ఉంటుంది. మానసికమైన అహం తలెత్తే అవకాశం ఉంది. అమావాస్య రోజుల్లో చంద్రుని వలన బుద్ధి ప్రకాశవంతంగా ఉండక కల్లోలానికి గురవుతారు. ద్వంద్వ రాశులలో గ్రహ సంచారం వలన విద్య ఉద్యోగాలు అభివృద్ధి, చలనము మొదలగు మార్పులను గమనిస్తూ ఉంటాం. అగ్ని తత్వరాశి అయిన ధనురాశిలో ఈ షష్ట గ్రహ ప్రభావము మన మానసిక శక్తి పరీక్షలాంటిది. కోరికలను అదుపులో ఉంచుకుంటే ఈ పరీక్ష చక్కగా దాటగలం. అదే సమతులనం కోల్పోతే రానున్న రోజుల్లో తప్పకుండా ఇబ్బందికి గురవుతారు. కేతువు బంధనాలను విడదీయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ఈ గ్రహణం వల్ల ఏ రాశివారు చూడకూడదు ?
ధనుస్సు రాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఈ గ్రహణాన్ని ఆరాశి వారు, అష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వృషభ రాశి వారు, అర్ధాష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కన్య రాశి వారు చూడకపోవడం మంచిదని జ్యోతిషులు చెబుతున్నారు. గ్రహణ సమయంలో సూర్యకిరణాలు పడకుండా చూడాలని అంటున్నారు. మిగతా రాశుల వారికి ఈ గ్రహణ ప్రభావం పెద్దగా ఉండదని పేర్కొంటున్నారు.

సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది ?

సూర్యుడు , భూమికి మధ్యలో చంద్రుడు వచ్చి ఆ నీడ సూర్యుడిపై పడినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం, చంద్రుడు సూర్యుడికి మధ్యలో నుంచి అంచులో అగ్నివలయంలాగా కనిపిస్తాడు. అందుకే దీనిని కంకణాకర గ్రహనం అంటున్నారు. మార్గశిర అమావాస్య నాటి అబ్ధిక కార్యక్రామాన్ని యధావిధిగా అపరాన్నకాలంలో జరుపుకోవచ్చుని పండితులు చెబుతున్నారు. గ్రహణ పట్టు, విడుపు మధ్యస్నానాలాచరించే వారు వారికున్న మంత్రనుష్టానాలతో ఆచరించి యధావిధిగా స్నానాదులు ఆచరించికోవచ్చట.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జన్మ నక్షత్ర, రాశ్యాదులలో గ్రహణం చెడు ఫలితాలను ఇస్తుంది. ఎవరి జన్మరాశి, జన్మ నక్షత్రంలో గ్రహణం ఏర్పడుతుందో వారికి విశేషంగా పూజలు, జపాలు, దానాలు చేయాలి. గ్రహణం పడిన నక్షత్రంలో ఆరు నెలలు ముహూర్తాలు నిషేధిస్తారు. జన్మరాశి నుంచి 3,6,10,11 రాశులలో గ్రహణమైన శుభప్రధం 2,5,7,9 రాశులలో మధ్యమం, మిగిలిన రాశులలో అరిష్టం. ప్రస్తుత సూర్యగ్రహణం మూల నక్షత్రం, ధనుస్సు రాశిలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ నక్షత్ర కలిగిన వ్యక్తులు దానాలు, జపాలు చేయాలి.

– కేశవ

 

Read more RELATED
Recommended to you

Latest news