రాజధానిపై అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన దీక్షలు ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి. మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. వెలగపూడిలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అమరావతి రైతులకు మహిళలు పెద్ద ఎత్తున వచ్చి సంఘీభావం ప్రకటించారు. అమరావతిలోనే రాజధాని ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తుళ్లూరులో రైతు, యువత వినూత్న రీతిలో నిరసనకు దిగారు.
యువత రోడ్డుపై కారమ్స్, షటిల్, క్రికెట్, వాలీబాల్ ఆటలను ఆడుతూ తమ నిరసనను తెలియజేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా మాస్క్‌లతో యువత ఆటలు ఆడారు. దీక్షల సందర్భంగా కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో రోడ్డుపై ఆటలు ఆడాల్సి వస్తోందని యువత పేర్కొంది. అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ…రాష్ట్ర ప్రభుత్వాన్ని డైరెక్ట్ చేయాలని యువత కోరింది.