పీడ కలలు వచ్చినప్పుడు వీటిని తప్పక చేయ్యాలట..

-

నిద్ర పోతున్న సమయంలో కలలు రావడం సహజం..అందులో కొన్ని సాధారణ కలలు వస్తే, మరి కొన్ని భయంకర కలలు వస్తాయి..అవి చాలా భయంకరంగా ఉండి,మనుషులను ఊకసారి ఉలిక్కి పడ తారు. జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నట్లు లేదా ఏదైనా విజయం సాధించినట్లు కలలు వస్తుంటాయి.ఇష్టమైన వాటిని దక్కించుకున్నట్లు కొందరు కలలు కంటారు. అభిమాన తారను కలిసినట్లు, లేదా మంచి జీతంతో ఉద్యోగం సాధించినట్లు, పరీక్షల్లో మెరుగైన మార్కులు పొందినట్లు ఇలా చాలా కలలు వస్తుంటాయి. ఇలాంటి కలలు వచ్చినప్పుడు మనసు హాయిగా ఉంటుంది.


కోరుకున్న పని జరిగినా, ఆశించిన వస్తువు అందుకున్నా సంతోషం కలగడం సహజం. కానీ కొందరికి నిద్రలో పీడకలలు వస్తుంటాయి. చెడు కలలు తరచూ వస్తూ నిద్ర నుండి ఉలిక్కి పడి లేచేలా చేస్తాయి..అయితే ఇలాంటి కలల గురించి బయట పడాలని చాలాసార్లు అనుకున్న కూడా దాదాపు కుదరదు..అవి నిజ జీవితంలో ఎక్కడ నిజమవుతాయోననే భయం అయితే.. పడుకున్న వేళ వచ్చే కలలు అవి వచ్చే టైమును బట్టి వాటి ఫలితం ఉంటుంది. తెల్లవారుజామున కలిగే ఫలితాలు నిజాలు అవుతాయని అంటారు. ఇలా ఉదయం వేళ వచ్చే కలలు వెంటనే ఫలిస్తాయట. రాత్రి వేళ వచ్చే కలల ఫలితం కొంత ఆలస్యంగా ఉంటుంది.

అనారోగ్యంతో ఉన్నపుడు ఒకే విషయం గురించి, ఎక్కువగా ఆలోచించేటప్పుడు ఆ విషయాలు స్వప్నంలోవస్తే పెద్దగా దోషం ఉండదు.ఇకపోతే తనకు లేదా తనవారికి ఇబ్బంది ఉన్నట్టు లేదా స్వప్న శాస్త్రం ప్రకారం దుష్ఫలితాలు కలిగించే కలలు వచ్చినపుడు వెంటనే నిద్రమేల్కొంటే, దుర్గా అమ్మవారిని స్మరించుకోవటం చేస్తే సరిపోతుందని నిపుణులు అంటున్నారు.ఉదయం తలస్నానం చేసి, కనీసం మూడు రకాల నూనెలు కలిపి ఇష్ట దేవత ముందు దీపం వెలిగించాలి. స్వప్న దోష పరిహారం కోసం ఉప్పు లేదా గుమ్మడి కాయ లేదా నిమ్మకాయ అక్కడ వుంచి పడ వెయ్యడం మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version