వాస్తు: అప్పు ఇచ్చేటప్పుడు ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి…!!

-

కొంతమంది కొన్నిటిని బలంగా నమ్ముతారు.. మరి కొంత మంది అస్సలు నమ్మరు. అయితే అప్పు తీసుకునేటప్పుడు,ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు..కొన్ని నియమాలను పాటించడం మంచిదని జ్యోతిష్య పండితులు అంటున్నారు..ఎవరికి అప్పు ఇవ్వవచ్చు…ఏ రోజు ఇవ్వాలి…మళ్లీ మన డబ్బు మనకు వస్తుందా అనే విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినా…లేదంటే ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్న, కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి అవేంటో ఇప్పుడు చుద్దాము..

కొన్నిసార్లు కొంత అప్పు చాలా సమస్యగా మారుతుంది. అప్పు తిరిగి చెల్లించలేము. సకాలంలో డబ్బు చేతికి అందదు. కాబట్టి ఏదైనా వ్యక్తి నుంచి అప్పు తీసుకున్నా…ఇచ్చినా కొన్ని విషయాలను తప్పకుండా పరిగణలోనికి తీసుకోవాలి.చాలా మంది జోతిష్యాన్ని అస్సలు నమ్మరు. కొన్ని విధానాలతో కొన్ని పనులు జరగకపోవచ్చు. అయితే వారు సమస్యల్లో పడే అవకాశంఉంటుంది. జోతిష్యం ప్రకారం కొన్ని నక్షత్రాల వారు అప్పులు చేయకూడదు. పంచాంగం ప్రకారం హస్త నక్షత్రం వారు తీసుకున్న అప్పుతీర్చడం చాలా కష్టంగా ఉంటుంది. మూల, అద్ర, జ్యేష్ట, విశాఖ, క్రుత్తిక, ఉత్తర, ఫాల్గుణి, ఉత్తరాషాడ, ఉత్తర బాద్రపద, రోహిణి ఇలాంటి నక్షత్రాలలో అప్పులు చేయకుండా ఉండటమే మంచిదని నిపుణులు అంటున్నారు..

ఎవరైనా రుణం తీసుకోవడానికి మంగళవారం చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు తీసుకున్న అప్పు త్వరలో తీరుతుంది. బుధవారం ఎవరూ అప్పు ఇవ్వకూడదు. ఈరోజు అప్పు ఇచ్చినట్లయితే ఎప్పటికీ తీరదు. ఇక కొన్నిసార్లు మనం ఇచ్చిన అప్పు తిరిగి మనకు రాదు. అప్పులో డబ్బులు ఉన్నా ఇతరత్రా ఇబ్బందులు ఎదురవుతుంటాయి.వాటి నుంచి విముక్తి పొందాలంటే ఖచ్చితంగా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చెయ్యడం వల్ల రుణ బాధలు తొలగిపోతాయని అంటున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news