ప్రతి సంవత్సరం ఒక్కో రూపంలో ఖైరతాబాద్ వినాయకుడిని ప్రతిష్ఠించడం ఆనవాయితీ. ఈసారి ద్వాదశ ఆదిత్య మహా గణపతిగా ఖైరతాబాద్ గణేశ్ దర్శనమివ్వనున్నాడు.
వినాయక చవితి అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది ఎవరు? ఖచ్చితంగా ఖైరతాబాద్ గణేశ్. అవును.. దేశంలోనే అంత పెద్ద వినాయకుడి విగ్రహాన్ని ఇంకెక్కడా పెట్టరు. అందులోనూ ఖైరతాబాద్ గణేశ్ చాలా పవర్ ఫుల్. అక్కడికివెళ్లి భక్తులు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని ప్రసిద్ధి. అందుకే ఖైరతాబాద్ వినాయకుడికి అంత పేరు.
ప్రతి సంవత్సరం ఒక్కో రూపంలో ఖైరతాబాద్ వినాయకుడిని ప్రతిష్ఠించడం ఆనవాయితీ. ఈసారి ద్వాదశ ఆదిత్య మహా గణపతిగా ఖైరతాబాద్ గణేశ్ దర్శనమివ్వనున్నాడు. ద్వాదశ ఆదిత్య మహా గణపతి అంటే.. 12 తలలు, ఏడు అశ్వాలు, 12 సర్పాలతో మొత్తం 61 అడుగుల ఎత్తులో ఈసారి గణేశ్ ను తయారు చేస్తున్నారు.
ద్వాదశ ఆదిత్య మహా గణపతి విశిష్టత ఏంటంటే.. ఈరూపంలో ఉన్న వినాయకుడిని కొలిస్తే సమృద్ధిగా వర్షాలు పడటంతో పాటు అందరికీ మంచి చేకూరుతుంది.
అయితే.. వినాయకుడి విగ్రహం ఎత్తును ప్రతి సంవత్సరం తగ్గిస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం 12 తలలతో గణేశ్ ను రూపొందిస్తుండటంతో అది కాస్త 61 అడుగులకు చేరుకుంది. ఈసారి వినాయకుడికి పక్కన ఒక వైపు సిద్ధ కుంజికా దేవి విగ్రహం ఉంటుంది. మరోవైపు త్రిమూర్తుల స్వరూపుడైన దత్తాత్రేయుడు కొలువుదీరనున్నాడు.