లక్ష్మి కటాక్షం కోసం లంకాధిపతి చెప్పిన రహస్యాలు!

Join Our Community
follow manalokam on social media

రామాయణంలో రావణుడి పాత్రను కీర్తించినవారున్నారు. అదే సమయంలో ఆయన్ని అసహ్యించుకున్న వారున్నారు. అత్యంత శక్తివంతమైన వారిలో రావణుడు ఒకరు. రావణుడు చాలా తెలివైన వాడు కూడా. డబ్బు కోసం దశకంఠుడు చెప్పిన నియమాలేంటో చూద్దాం.

రావణుడి చిట్కాలు

లంకాధీశుడు ఎలాంటి శక్తులకు లొంగని రాజు. శివభక్తుడు, పండితుడు, గొప్ప సంగీత విద్వాంసుడు. మరోవైపు ప్రతీకారంతో రాముడి భార్య అయిన సీతన అపహరించిన వ్యక్తిగా చరిత్రలో మిగిలాడు. ఎంత దుర్మార్గుడైన తన మేధో చతురత, జోతిష అవగాహనతో పలు ప్రశంసలు అందుకున్నారు. దీనివల్లే అతనికి అపర సంపదలు, దేవతలపై ఆధిపత్యానికి కారణమని అంటారు. అంతేకాదు అన్ని వేదాలు, పురాణాలు, శాస్త్రాలపై అవగాహన కలదు రావణుడికి. జోతిషశాస్త్రంతో పాటు తాంత్రిక శక్తులున్నాయని అంటారు.

రావణుడు పుట్టుకతోనే బ్రహ్మదేవుడి కుమారుడు. సప్తరుషుల్లో ఒకరైన పులస్త్య మహర్షికి రావణుడు మనవడు. విజయంతోపాటు ధనం, ఆరోగ్యం, కీర్తి ఎల్లప్పుడు నియంత్రణలో ఉండేవి.

ఆర్థికపరమైన, ఇబ్బందులు ఎదుర్కొంటే పండితుడి సహాయంతో పవిత్రమైన ముహూర్తంలో ఈ పూజను చేసుకోవాలని చెప్పాడు. పవిత్ర నది, లేదా కొనేరు దగ్గర్లో ఉన్న రావి చెట్టు కింద పూజ చేయాలని తెలిపాడు.

పవిత్రస్నానం

పూజకు ముందు పవిత్ర స్నానం చేయాలి. ఆ తర్వాత రావి చెట్టు కింద కూర్చొని ‘‘ ఓం హ్రీం క్లీం నమః ద్వాహ ద్వాహ స్వాహా’’ అనే మంత్రాన్ని 1100 సార్లు పఠించాలి. ఈ విధంగా 21 రోజుల పాటు నిరంతరం చేయాలి. ఒకవేళ మధ్యలో ఆపేసినా మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది.

శ్రీసూక్త పాఠాన్ని పఠించాల్సిన విధానం

ఉత్తరేణి మొక్క విత్తనాలను నూరి అందులో మేకపాలు కలిపి శరీరానికి పూసుకోవాలి. దాని సువాసన దేవతలను ఆకర్షిస్తుంది. ఆ తర్వాత నిర్మల భక్తితో శ్రీసూక్త పాఠాన్ని పారాయణం చేయాలి. పూర్తయిన తర్వాత 7 మారేడు ఆకులను, 7 తమలపాకులను శివలింగానికి సమర్పించాలి. 21 రోజుల నిర్వీరామంగా పూర్తి చేయాలి. పూర్తి చేయడానికి వీలు పడని వారు జిల్లేడుపూలను , తెల్ల ఆవుపాలతో కలిపి నుదుటిపై తిలకం దిద్దు కోవాలి. లేదా గరికిపూసలు, ఆవుపాలు కలిపి తిలక ధారణ ప్రతిరోజు చేసుకోవాలి. ఈ విధంగా పాటించి ఆచరించిన వారికి లక్ష్మీదేవి కటాక్షిస్తుందని దశకంఠుడు చెప్పాడు.

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...