తిరుమల డిసెంబర్ ఆర్జిత సేవా టికెట్లు విడుదల

263

భక్తుల కొంగుబంగారం… కలియుగ దైవంగా ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీవేంకటేశ్వరుడి దర్శనం ఒక్కసారి చేసుకుంటే చాలు అనుకునేవారు కోట్లాదిమంది. అందులో ఆర్జిత సేవా జీవితకాలంలో చేసుకోవాలి అని తపించేవారు ఎందరో.. అయితే టీటీడీ మూడునెలల ముందుగానే ఆర్జితసేవా టికెట్లను విడుదల చేస్తుంది. ఈ టికెట్లను ఆన్‌లైన్‌లో, టీటీడీ సేవాకేంద్రాలలో బుక్‌చేసుకోవచ్చు. భక్తులు వారికి ఇష్టమైన సేవల్లో పాల్గొనడానికి ఈ టికెట్లను బుక్ చేసుకోవాలి.

TTD Releases arjitha seva tickets for december 2019
TTD Releases arjitha seva tickets for december 2019

డిసెంబర్ కోటా విడుడల

తిరుమల ఆలయంలో డిసెంబరు నెలకు సంబంధించి మొత్తం 68,466 ఆర్జిత సేవాటిక్కెట్లు అందుబాటులో ఉన్నట్లు ఈవో తెలిపారు. ఆన్‌లైన్ డిప్ విధానం ద్వారా సుప్రభాతం-3,856, తోమాల-60, అర్చన-60, అష్టదళపాద పద్మారాధన-240, నిజపాద దర్శనం-2,300, సాధారణ కోటాలో విశేషపూజ-2,500, కల్యాణోత్సవం-13,775, ఊంజల్‌సేవ-4,350, ఆర్జిత బ్రహ్మోత్సవం-7,975, వసంతోత్సవం-15,950, సహస్రదీపాలంకరణసేవ- 17,400 టిక్కెట్లు ఉన్నాయని ఆయన వివరించారు.

-కేశవ