వాస్తు: వీటిని అనుసరించండి.. మంచి ఉద్యోగం పొందండి..!

-

ఉద్యోగం లేక బాధ పడుతున్నారా…? ఎన్నో ఏళ్ల నుండి ప్రయత్నం చేసినా ఉద్యోగం రావడం లేదా..? అయితే మీరు తప్పకుండా ఈ వాస్తు vastu చిట్కాలను పాటించండి. ఈ వాస్తు చిట్కాలు పాటించారంటే అదృష్టం దానంతట అదే వస్తుంది. మరి ఆలస్యమెందుకు వాస్తు టిప్స్ గురించి చూసేయండి.

వాస్తు /vastu

ఉద్యోగం కోసం చూసే వాళ్ళు మీరు చదువుకునే స్టడీ టేబుల్ వంటి వాటిని పండితులు చెప్పిన విధంగా మార్చుకోవాలి. మీరు ఉపయోగించే ఫర్నిచర్ గుండ్రంగా కాకుండా ఉండేట్టు చూసుకోండి. మీరు రెక్టాంగిల్, స్క్వేర్ ఆకారంలో వుండే ఫర్నిచర్ ని ఉపయోగించవచ్చు. దీని వల్ల మీకు మంచి బెనిఫిట్ కలుగుతుంది.

ఒకవేళ కనుక మీ ఫర్నిచర్ పాడైపోతే అది నెగిటివ్ ఎనర్జీ కి దారి తీస్తుంది. కాబట్టి వాటిని బాగు చేసుకోవడం మంచిది. అలానే మీ ఇంట్లో ఉండే కుళాయిలుపై కూడా శ్రద్ధ పెట్టాలి. ఎప్పుడు చూసినా కుళాయిల నుండి నీరు కారుతూ ఉంటే అది మంచి సూచన కాదని ఇంట్లో అలా ఎప్పుడూ నీళ్ళు కారుతూ ఉండకూడదని పండితులు చెప్పారు.

కాబట్టి ఈ తప్పులు కూడా సరి చేసుకోండి. అదే విధంగా మొక్కలు మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. లావెండర్, రోజ్ మేరీ వంటి వాటిని బయట నాటండి. దీని వల్ల ఒత్తిడి తగ్గి రిలాక్స్ గా ఉండొచ్చు.

అదేవిధంగా ఇది మంచి ఆదాయానికి సంకేతం. మీరు ఉండే ఆ ప్రదేశం అంతా కూడా శుభ్రంగా ఉండేటట్లు చూసుకోండి. చెత్తా చెదారం ఉంచుకోవడం వల్ల అక్కడ నెగెటివిటీ వస్తుంది కాబట్టి ఈ తప్పులు ఏమి చేయకుండా ఉండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version