చాలా శాతం మంది వాస్తు శాస్త్రం గురించి అవగాహన లేకపోవడం వలన ఎన్నో తప్పులను చేస్తూ ఉంటారు. అటువంటి పొరపాట్లు వలన ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం లేక వాస్తు శాస్త్రం ప్రకారం చెప్పినా నియమాలను పాటించడం వలన ఎన్నో సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు. పైగా సానుకూల శక్తి ఇంట్లో ఎక్కువగా ప్రవహిస్తుంది. దీంతో ఎంతో సంతోషంగా మరియు ప్రశాంతంగా జీవించవచ్చు. మీ ఇంట్లో సానుకూల శక్తితో పాటుగా లక్ష్మీదేవి కటాక్షం లభించాలంటే తప్పకుండా వాస్తు శాస్త్రాన్ని పాటించాలి. ఆ నియమాలను పాటించడం వలన అనేక సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
అదేవిధంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అద్దం ను పెట్టడానికి కూడా ఒక ప్రత్యేక దిశ ఉంది. అద్దంను దక్షిణ దిశలో పెట్టడం వలన ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. ఎందుకంటే యమధర్మరాజు ఉండే దక్షిణం దిశలో అద్దం ను పెట్టడం వలన యమదూతల్ని పంపిస్తాడు అని పండితులు చెబుతున్నారు. కనుక అద్దాన్ని దక్షిణం వైపు అస్సలు పెట్టకూడదు. దీనితో పాటుగా ఉద్యోగం, వ్యాపారం మరియు కెరియర్ కు సంబంధించిన ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
పైగా ప్రతికూల శక్తి ఎక్కువ అవుతుంది. సానుకూల శక్తిని పెంచుకొని ఎన్నో ఇబ్బందుల నుండి దూరంగా ఉండాలంటే మీ ఇంట్లో అద్దంను దక్షిణం వైపు అస్సలు పెట్టకండి. ఎప్పుడైతే ఇంట్లో అద్దంను దక్షిణం వైపున పెడతారో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది మరియు ఇంట్లో ధనం లేకుండా ఎన్నో ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య గొడవలు కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దక్షిణం వైపు అద్దం ఉండడం వలన సోదరుల మధ్య బంధం కూడా దృఢంగా ఉండదు. కనుక ఇటువంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే ఈ దిశలో అద్దంను అస్సలు ఉంచకండి.