ఈనెల 18, 19 తేదీలలో ఎంఎల్ఏ, ఎంఎల్సీ ల కోసం క్రీడలు, కల్చరల్ ప్రోగ్రామ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ ఛీఫ్ విప్ ఆంజనేయులు తెలిపారు. ఎంఎల్ఏ, ఎంఎల్సీలకు ప్రతీతోజు ఒత్తిడి ఉంటుంది. అధికార ప్రతిపక్షాలు అన్నదమ్ముల్లా రాష్ట్రం కోసం కష్టపడాలి. విభజన తరువాత చాలా దారుణమైన పరిస్ధితులు వచ్చాయి. కనీసం శాసన మండలికి వచ్చే ఎంఎల్సీలను అయినా రావాలని కోరాం.. చేసిన తప్పులకు సమాధానం చెప్పాల్సి వస్తుందని సభలకు వాళ్ళు రావడం లేదు. ఈ ఆటల పోటీలు ఒక ఆటవిడుపులా ఉంటాయి.
గత ఐదేళ్ళూ ఎంఎల్ఏ, ఎంఎల్సీ లకు ఇలాంటివి జరగలేదు. కూటమి ప్రభుత్వం లో పార్టీలకు అతీతంగా ఎంఎల్ఏ, ఎంఎల్సీ లను ఈ క్రీడలకు ఆహ్వానించాం. 12 రకాల ఆటలు ఈ పోటీలలో ఉంటాయి. ఎంఎల్ఏ, ఎంఎల్సీ లను ఆహ్వానించడం జరిగింది. గత ఐదేళ్ళలో టూరిజం పూర్తిగా దెబ్బతిన్నది. గత ఐదేళ్ళలో అవినీతి, దోపిడి గురించి తప్పనించి టూరిజం గురించి ఆలోచించలేదు. సభా సంప్రదాయాలను గతంలో మంటగలిపారు అని ఆంజనేయులు పేర్కొన్నారు.