వాస్తు: ఇంట్లో సమస్యలు, నష్టాలు రాకుండా ఉండాలంటే వీటిని అనుసరించండి..!

వాస్తును అనుసరించడం వల్ల ఎలాంటి సమస్య అయినా తొలగిపోతుంది. అదే విధంగా ఏ ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉండడానికి వాస్తు మనకు సహాయం చేస్తుంది. అయితే ఈ రోజు వాస్తు పండితులు మన కోసం కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. వీటిని కనుక ఫాలో అయితే కచ్చితంగా ఏ సమస్య లేకుండా ఉండొచ్చు. అయితే మరి ఇంట్లో ఎలాంటి వాస్తు చిట్కాలను అనుసరించాలి అనేది ఇప్పుడు చూద్దాం.

ఇంట్లో ఉండే డబ్బు:

మన ఇంట్లో ఉండే డబ్బులన్నీ దక్షిణ వైపు పెట్టుకుంటే మంచిది. ఇలా చేయడం వల్ల ఆర్ధిక నష్టం కలగదు. వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బులు ఎప్పుడూ కూడా దక్షిణం వైపుకి ఉండాలి. అలా చేయడం వల్ల ఇబ్బంది ఉండదు.

ముఖద్వారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

ఇంట్లో ఉండే ముఖద్వారం చాలా ముఖ్యమైనది. మంచి పాజిటివ్ ఎనర్జీ అటువైపు ఉండేటట్టు చూసుకోవాలి. ముఖద్వారం ఎప్పుడూ కూడా అందంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ కనుక అక్కడ చెత్తాచెదారం ఉంటే దాని వల్ల ఇబ్బందులు వస్తాయి. అలానే ముఖద్వారానికి ఎటువంటి పగుళ్ళు ఉండకూడదు. విరిగిపోయిన ద్వారాల వల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది. అలానే ఆర్ధిక నష్టం కలుగుతుంది.

వంట గదిలో ఉండే సామాన్లు:

రాత్రి ఆహారం తిన్న సామాన్లు శుభ్రం చేయకుండా వుంచేయకూడదు. ఇలా ఉంచడం వల్ల ఆర్ధిక నష్టం కలుగుతుంది. అలానే అనారోగ్య సమస్యలను కూడా ఇవి తీసుకొస్తాయి. నెగటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. కాబట్టి అలా సామాన్లు వదిలేయకూడదు. అలానే విరిగిపోయిన సామాన్లని పగిలిపోయిన వాటిని ఇంట్లో ఉంచకూడదు. ఇలా పండితులు చెబుతున్నట్లు ఈ వాసు చిట్కాలను ఫాలో అయితే కచ్చితంగా ఏ సమస్య లేకుండా ఉండొచ్చు.