ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వద్ద కొనుగోలు పంచాయితీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వడ్లు కొనాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంటే.. తాము కొన బోమని తేల్చి చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. దీంతో తెలంగాణ రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తమ వరి కొనుగోలు చేయబోరని ఆవేదన చెందుతూ.. ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ సంఘటన ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం శివ పూర్ గ్రామానికి చెందిన కుమార్ అనే రైతు… వరి కొనుగోలు చేయడం లేదని ఆవేదన చెందుతూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వడ్లు కుప్ప దగ్గరే పురుగుల మందు తెచ్చుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు కుమార్. అయితే పురుగుల మందు… తాగిన విషయాన్ని గమనించిన ఆయన కుటుంబసభ్యులు వెంటనే వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో కాసేపటి క్రితమే కుమార్ మరణించాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వ తప్పిదాల వల్లనే తమ కుటుంబం అయిపోయిందని ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.