వాస్తు: సమస్యల నుండి బయటపడాలంటే వీటిని ఫాలో అవ్వండి..!

ఇంట్లో తరచూ ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అలా సమస్యలు రాకుండా ఉండాలంటే వాస్తు చిట్కాలని అనుసరించాలి. వాస్తు ప్రకారం ఫాలో అవ్వడం వల్ల ఎలాంటి సమస్య అయినా తొలగిపోతుంది. అలానే పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తగ్గిపోతుంది. అయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావాలన్నా, మంచి జరగాలన్న ఈ వాస్తు చిట్కాలు బాగా ఉపయోగపడుతాయి. దీంతో శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు.

ఇంట్లో తరచు ఏదైనా సమస్యలు వస్తుంటే ఇంట్లో ఉప్పుని పెట్టండి. ఇంట్లో ఉప్పుని ఉంచడం వల్ల అది నెగటివ్ ఎనర్జీ లాక్కుంటుంది. దీంతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.
అలానే ఇల్లు కడిగేటప్పుడు నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసి దానితో ఇల్లు కడగండి. దీనితో నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరం అయిపోతుంది.
అదే విధంగా ఇంట్లో ఏదైనా కష్టంగా అనిపించినా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఉన్నా ఇంట్లో కర్పూరాన్ని పెట్టండి. కర్పూరం కూర నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది.
లానే ఇంట్లో ఉండే వాళ్ల మధ్య బంధం బాగుండాలంటే అందరూ నవ్వుతూ ఉన్న ఫ్యామిలీ పిక్చర్ ని పెట్టండి. ఇది కూడా పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది.
ఇంట్లో అందంగా పూలు పెట్టడం వల్ల కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ తగ్గిస్తుంది. ఇలా ఈ విధంగా వాస్తు చిట్కాలని ఫాలో అయితే కచ్చితంగా ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి. అలానే మంచి కలుగుతుంది.