వాస్తు: తరచూ మీ ఇంట్లో సమస్యలు వస్తున్నాయా..? అయితే ఇలా చెయ్యాల్సిందే..!

వాస్తు ప్రకారం అనుసరించడం వల్ల ఎలాంటి సమస్యలనైనా తొలగిపోతాయి. అదే విధంగా ఇంట్లో ఎక్కువ గొడవలు, అనారోగ్య సమస్యలు వంటివి ఉంటే అవి కూడా దూరం అయిపోతాయి అని వాస్తు పండితులు అంటున్నారు. అయితే ఈ రోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. వీటిని కనుక అనుసరిస్తే ఎలాంటి ఇబ్బందులు వున్నా సరే బయట పడచ్చు.

పైగా ఎంతో ప్రశాంతంగా ఉండొచ్చు. ఆనందంగా ఉండొచ్చు. ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. అయితే మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా పండితులు చెబుతున్న అద్భుతమైన చిట్కాలు గురించి చూసేద్దాం. మన ఇంట్లో మొక్కలు ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలానే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరం అయిపోతుంది. కనుక ఇంట్లో చిన్న చిన్న మొక్కలు పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

అలానే ఇల్లు చూడటానికి కూడా అందంగా ఉంటుంది. అందుకని ఈ రోజు వాస్తు పండితులు చిన్నచిన్న మొక్కలు ఇంట్లో పెట్టమని చెప్తున్నారు. అలానే సమస్యలేమీ వుండవు. అయితే ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అదేంటంటే ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ తూర్పు నుంచి పడమర వైపు కి, ఉత్తరం నుండి దక్షిణం వైపు వెళ్తుంది.

అందుకని ఉత్తరం మరియు తూర్పు వైపు మొక్కలు పెడితే మంచిది ఇలా చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ కి అస్సలు లోటు ఉండదు. అందమైన పూల మొక్కలు, గడ్డి, సీజనల్ మొక్కల ని మీరు తూర్పు వైపు లేదా ఉత్తరం వైపు పెడితే జబ్బులు బారిన పడకుండా ఉంటారు. కనుక మీరు మీ ఇంట్లో ఈ మార్పులు చేసి ఆరోగ్యంగా ఉండండి. అలానే సమస్యలేమీ లేకుండా ఆనందంగా ఉండండి.