ఇక బలవంతంగా మతం మారిస్తే 10 ఏళ్లు జైలు శిక్ష… అసెంబ్లీలో బిల్ పాస్ చేసిన కర్ణాటక

-

కర్ణాటక ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద ’’మత మార్పిడి వ్యతిరేఖ బిల్లు‘‘ ఆమోదం పొందింది. గతంలో కర్ణాటక కేబినెట్ ఈ బిల్లును తీసుకువస్తున్నట్లు వెల్లడించించి అప్పటి నుంచి కర్ణాటకలో ప్రతి పక్షాలు ఈ బిల్లుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఈ బిల్లును కర్ణాటక అసెంబ్లీ మూజువాణి ఓటుతో ఆమోదించింది.

బిల్లు ప్రవేశపెట్టే సమయంలో అసెంబ్లీలో తీవ్ర గందరగోళం చెలరేగింది. ముఖ్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బిల్లును తీవ్రస్థాయిలో వ్యతిరేకించింది. బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయింది. కొంత మంది బిల్లును వ్యతిరేఖిస్తూ స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లారు.

ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ సర్కార్ తీసుకువచ్చిన మత మార్పిడి వ్యతిరేఖ బిల్లు… బలవంతగా ఒక మతం నుంచి మరో మతానికి మారడాన్ని వ్యతిరేఖిస్తుంది. బలవంతంగా మతాన్ని మారిస్తే అందుకు పాల్పడిన వారికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. అయతే ఇప్పటికే ఇటువంటి మత మార్పిడి వ్యతిరేఖ బిల్లును ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు తీసుకువచ్చాయి. తాజాగా ఈ జాబితాలో కర్ణాటక ప్రభుత్వం కూడా చేరింది.

 

Read more RELATED
Recommended to you

Latest news