వాస్తు: వాచీ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది..!

వాస్తుని ఫాలో అవ్వడం వల్ల ఇబ్బందులు అన్ని తొలగిపోయి ఆనందంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఎక్కడ పండితులు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేయడం జరిగింది. వీటిని కనుక మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా మంచి జరుగుతుంది. చాలా మంది చేతికి వాచీ పెట్టుకుంటారు. అయితే వాచీ పెట్టుకునేవాళ్ళు ఈ విషయాలను జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ కనుక మీరు ఈ తప్పులు చేస్తూ ఉంటే సరి చేసుకోండి. దీనితో మీ యొక్క సమస్యలు పూర్తిగా దూరం అయిపోతాయి.

వాస్తు శాస్త్రం ప్రకారం వాచీలు పెట్టుకునేటప్పుడు వాచి డయల్ బాగా పెద్దగా ఉండకూడదు అని గుర్తుంచుకోండి. పెద్ద డైల్స్ ఉన్న వాటిని ధరించడం వల్ల సమస్యలు ఎక్కువగా వస్తాయి. అలాగే కెరియర్ పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. చిన్న డైల్ ఉండి సరిగ్గా సమయానికి చూపించే వాచీ పెట్టుకుంటే మంచి కలుగుతుంది. కాబట్టి నార్మల్ సైజు వాచీని మాత్రమే కొనుగోలు చేయండి.

అలానే వాచి డయల్ గుండ్రంగా లేదా స్క్వేర్ ఆకారంలో ఉండొచ్చు. అదే విధంగా వాస్తు ప్రకారం కుడి చేతికి లేదా ఎడమ చేతికి మాత్రమే పెట్టుకోవాలని లేదు మీకు నచ్చిన చేతికి మీరు వాటిని పెట్టుకోవచ్చు. అలాగే వాటి యొక్క రంగులు విషయానికి వస్తే… సిల్వర్ లేదా గోల్డ్ రంగులో ఉన్న వాచీలని ధరిస్తే చాలా మంచి కలుగుతుంది.

కనుక ఏదైనా ఇంటర్వ్యూ కానీ పరీక్ష కానీ ఉంటే ఆ రంగుల వాచీలని పెట్టుకుంటే మంచిది. అలానే వాచీలను నిద్ర పోయినప్పుడు తల కింద పెట్టుకోవడం మంచిది కాదు. అలా చేయడం వల్ల మెదడు అంతా కూడా నెగిటివిటీతో నిండి పోతుంది. కనుక వాచీల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఇబ్బందులు తొలగిపోతాయి.