వాస్తు శాస్త్రం లో చెప్పిన నియమాలను పాటించడం వలన జీవితం లో ఎంతో ఉపయోగం ఉంటుంది. అయితే ఇంట్లో ఉండే వస్తువులకు కూడా వాస్తు నియమాలను పాటించడం వలన ఎంతో మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఎంతో సంతోషాన్ని పొంది ఎటువంటి సమస్యలు లేకుండా ఆనందంగా జీవిస్తారు. పైగా ఇంట్లో ప్రతికూల శక్తీ తొలగిపోయి ప్రశాంతంగా జీవించవచ్చు. కనుక వాస్తు నిపుణులు చెప్పిన సలహాలను మరియు సూచనలను ఖచ్చితంగా పాటించండి. ప్రస్తుతం ఎండలు ఎక్కువ అవుతున్నాయి అయితే ఎక్కువ ఉష్ణోగ్రతలు వలన చల్లని నీరు తాగుతూ ఉంటారు. దీని కోసం కొంత మంది మట్టి కుండను ఉపయోగిస్తారు.అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మట్టి కుండకు కూడా సరైన దిశను నిర్ధారించారు.
మట్టి కుండలో నీళ్లను నింపి ఉత్తరం వైపున పెట్టడం వలన ఎంతో మంచి జరుగుతుంది. అంతేకాకుండా ఇలా ఇంట్లో లేక ఆఫీసులో పాటిస్తే సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ముఖ్యంగా సంపదకు సంబంధించిన సమస్యలు ఉంటే తొలగిపోతాయి. పైగా అనారోగ్యాలు సమస్యలు కూడా తగ్గించడానికి దీనిని పాటించవచ్చు. జీవితంలో అదృష్టాన్ని పొందాలంటే కచ్చితంగా ఈ వాస్తు నియమాన్ని పాటించాల్సిందే అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అంతేకాక జీవితంలో మరింత అదృష్టాన్ని పొందాలంటే మట్టికుండ దగ్గర కూడా దీపం పెట్టవచ్చు.
ఇలా చేయడం వలన దురదృష్టం తగ్గుతుంది దీంతో ఎంతో సంతోషంగా జీవించవచ్చు. వీటితో పాటుగా మీ జీవితంలో అదృష్టం పొందాలంటే వాటర్ ఫౌంటెంట్ లేక నీటిని చిత్రించే పెయింటింగ్స్ ను ఉత్తరం దశలో లేక తూర్పు దశలో అయినా పెట్టవచ్చు. ఇలా చేయడం వలన మీ జీవితంలో ఎంతో అదృష్టం వస్తుంది. దీంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎంతో ఆనందంగా జీవిస్తారు. కాకపోతే ఇంటి పై ఉండే వాటర్ ట్యాంక్ ను నైరుతి దిశలో పెట్టాలి లేదా దక్షిణ దిశలో అయినా పెట్టవచ్చు. కాకపోతే ఈశాన్యంలో మాత్రం వాటర్ ట్యాంక్ ను అస్సలు పెట్టకూడదు. కనుక ఈ వాస్తు నియమాలను పాటించి ఆనందంగా ఉండండి.