మనీ ప్లాంట్ ను ఇంట్లో పెడుతున్నారా? అయితే ఈ పొరపాట్లను అస్సలు చేయకండి..!

-

వాస్తు శాస్త్రంలో ఎన్నో నియమాలు ఉంటాయి. చాలా శాతం మంది వాటిని పాటిస్తూ ఉంటారు. ఎప్పుడైతే వాస్తు నియమాలను అనుసరిస్తారో, జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా, అందరూ కలిసి సంతోషంగా జీవించగలుగుతారు. మొక్కలకు సంబంధించి వాస్తు నియమాలను పాటించడం వల్ల కూడా ఎంతో మార్పు కనిపిస్తుంది. చాలా మంది ఇంట్లో అందమైన మొక్కలను పెంచుతారు. ఎప్పుడైతే ఇంట్లో ఖాళీ ప్రదేశాలు ఉంటాయో నచ్చిన మొక్కలను పెంచుకోవచ్చు. తక్కువ చోటు ఉన్నప్పుడు మాత్రం చిన్న మొక్కలను పెంచడం మేలు.

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో మనీ ప్లాంట్‌ ను ఉంచినప్పుడు అదృష్టం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి, సంపదలో ఎలాంటి లోటు ఉండదు. అదేవిధంగా జీవితాంతం ఆనందంగా ఉంటారు. పైగా మనీ ప్లాంట్‌ ను ఇంట్లో పెట్టడం వల్ల సానుకూల శక్తి అధికమవుతుంది. ఈ విధంగా ప్రశాంతమైన వాతావరణాన్ని పొందవచ్చు. శుక్రవారం రోజున మనీ ప్లాంట్‌ ను నాటడం వల్ల ఎంతో మేలు కలుగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. అంతేకాక దీపావళి, నవరాత్రి, అక్షయ తృతీయ వంటి ప్రత్యేక రోజుల్లో కూడా మనీ ప్లాంట్‌ ను నాటవచ్చు.

ఆగ్నేయ దిశ కుబేరుడుకు సంబంధించినది. అందువలన ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్‌ ను పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. పైగా ఈ దిశ ధనాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుంది. అదే విధంగా ఈశాన్య దిశలో కూడా మనీ ప్లాంట్‌ ను ఉంచితే సానుకూల శక్తి పెరుగుతుంది మరియు ఆదాయం పెరుగుతుంది. అయితే ఉత్తర దిశలో మనీ ప్లాంట్‌ ను అస్సలు పెట్టకూడదు. అలాగే, బాత్రూం లోనూ కూడా మనీ ప్లాంట్ ను ఉంచకూడదు అని వాస్తు పండితులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news