వాస్తు: మానసిక సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు దూరం అవ్వాలంటే వీటిని పాటించాల్సిందే..!

వాస్తు దోషాలు తొలగిపోయి, నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోవాలంటే కచ్చితంగా వాస్తు చిట్కాలని పాటించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఫాలో అవ్వడం వల్ల ఎలాంటి సమస్యలు అయినా పరిష్కారం అవుతాయి. ఈరోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. వీటిని కనుక ఫాలో అయితే ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు.

అయితే మరి పండితులు చెబుతున్న అద్భుతమైన వాస్తు చిట్కాలు గురించి చూసేద్దాం. భార్య భర్తల మధ్య ప్రేమ పెరగాలంటే ఈశాన్యం వైపు నిద్రపోవాలి. ఇలా చేయడం వల్ల ఇద్దరి రిలేషన్షిప్ బాగుంటుంది. అలానే ప్రేమ కూడా పెరుగుతుంది. అలాగే బెడ్రూంలో ఎప్పుడూ కూడా క్రూర జంతువుల ఫోటోలు పెట్టకూడదు.

అదే విధంగా వాస్తు శాస్త్రం ప్రకారం మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు. అలానే బెడ్ రూమ్ తలుపుకి దగ్గరలో మంచం ఉండకూడదు. ఒకవేళ కనుక బెడ్ రూమ్ లో బాత్ రూమ్ ఉంటే ఆ తలుపు ఎప్పుడూ కూడా మూసి ఉండాలి. అలానే పాత సామాన్లు చెత్తాచెదారాన్ని మంచం కింద ఎప్పుడూ పెట్టకూడదు.

బెడ్రూమ్ గోడలు తెలుపు లేత ఎరుపు రంగు ఉంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్రీన్ కలర్, పింక్ కలర్ లేదంటే నీలం రంగు మంచిది. ఇవి బెడ్రూంలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి. కనుక ఈ విధంగా పాటించడం వల్ల మానసిక ఒత్తిడి దూరమవుతుంది. అలానే భార్యాభర్తల మధ్య బంధం బాగుంటుంది. ఆర్ధిక సమస్యలు కూడా ఉండవు.