కరీంనగర్ రూరల్ మండలం చెర్లబూత్కూర్ కి చెందిన పుష్పాంజలి పురటినొప్పులతో బాధపడుతుండగా స్థానికులు 108కి సమాచారం అందించారు. సిబ్బంది చేరుకుని గర్భిణీ ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువయ్యాయి. సిబ్బంది తిరుపతి, రవి గర్భిణీకి పురుడు పోయగా పండంటి పాపకు జన్మించింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. తదుపరి చికిత్స నిమిత్తం వారిని కరీంనగర్ మాతాశిశు ఆసుపత్రికి తరలించారు.
కరీంనగర్ రూరల్: 108అంబులెన్స్ లో మహిళ ప్రసవం
-