వాస్తు: ముఖ ద్వారం విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

-

చాలామంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. నిజానికి వాస్తుని ఫాలో అవ్వడం వల్ల సమస్యలు కూడా తొలగిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరం అయిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. కనుక వాస్తు ప్రకారం నడుచుకుంటే మంచిది అప్పుడు మంచి కలిగి సమస్యలన్నీ దూరమవుతాయి. ఈరోజు వాస్తు పండితులు ముఖద్వారానికి సంబంధించి కొన్ని విషయాలని చెప్పారు వాటిని అనుసరిస్తే సమస్యలు తొలగిపోతాయి అయితే మరి పండితులు చెప్పిన వాస్తు చిట్కాల గురించి ఇప్పుడే చూసేద్దాం.

ముఖద్వారం విషయంలో కచ్చితంగా ఈ మార్పులు చేసుకోండి లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా మంది ముఖద్వారానికి సంబంధించి తప్పులు చేస్తూ ఉంటారు అలా చేయకుండా ఉంటే మంచి కలుగుతుంది.

ఎప్పుడూ కూడా ముఖద్వారం పడమర వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఉండాలి తూర్పు వైపు వున్నా సరే మంచిదే ముఖద్వారం వలన ఇంటికి ఆనందం కలుగుతుంది. ధనం కలుగుతుంది.
ఒకవేళ కనుక మీరు దక్షిణంవైపు ముఖద్వారాన్ని పెట్టుకోవాలి అనుకుంటే వాస్తు పిరమిడ్ ని మీరు ముఖ ద్వారం దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే వాస్తు దోషాలు కలగవు. అదే విధంగా ముఖద్వారం రంగు వచ్చేసి లైట్ పసుపు లేదా వుడ్ కలర్ అయి ఉండాలి. ఇలా చేస్తే కూడా మంచి కలుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
ముఖద్వారం రంగు ఎప్పుడూ కూడా లైట్ గానే ఉండాలి. అప్పుడే పాజిటివిటీ వస్తుంది. విరిగిపోయిన కుర్చీలు, డస్ట్ బిన్లు, పనికిరాని సామాన్లు ముఖద్వారం వద్ద ఉంచకూడదు. దీని వలన నెగిటివిటీ వస్తుంది.
ముఖద్వారానికి స్వస్తిక్ ఓంకారం ఇలాంటివి ఉంచితే మంచిది. లేదా ముఖద్వారం వద్ద పువ్వులని పెట్టొచ్చు ముగ్గులను కూడా పెట్టొచ్చు ఇలా ఈ విధంగా ముఖద్వారం ఉంటే మంచి జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version