కన్నతల్లి పట్ల కొడుకుల కర్కశత్వం.. మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు

-

ఏపీలోని ప్రకాశం జిల్లాలో కన్న తల్లి పట్ల ఇద్దరు కొడుకులు కర్కశత్వంగా ప్రవర్తించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు తిండి పెట్టకుండా ఇబ్బందులకు గురిచేయడంతో పాటు య‌ర్ర‌గొండ‌పాళెంలో స్థానికంగా ఉన్న హనుమాన్ ఆలయం వద్ద వదిలేసి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పాపం ఆ తల్లి పైకి లేచేందుకు కూడా చాలా ఇబ్బంది పడుతోంది.

లేచే ఓపికలేక‌, ఆహారం కూడా తిన‌లేని స్థితిలో పడి ఉన్న వృద్ధురాలి ఘటనపై మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. ఆ తల్లికి ఆహారం అందించడంతో పాటు వసతి కల్పించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై అధికారులతో కలిసి కృషి చేస్తానని మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. మంత్రి నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version