భారత రాజ్యాంగ దినోత్సవం.. ఆకట్టుకుంటోన్న తెలంగాణ బీజేపీ పోస్టు

-

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తెలంగాణ బీజేపీ పెట్టిన పోస్టు ఆకట్టుకుంటోంది. ప్రధాని మోడీ రాజ్యాంగ విలువలను అనుక్షణం కాపాడుతున్నారని, రాజ్యాంగ గౌరవాన్ని కాపాడుతూ మోడీ ప్రజా యోగ్యమైన పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. సత్యమేవ జయతే నినాదమే ఊపిరిగా సదా రాజ్యాంగ పరిరక్షణలో నరేంద్ర మోడీ అంటూ రాసుకొచ్చింది. న్యాయ వ్యవస్థలో మార్పులు, ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ పరిరక్షణలో భాగమేనని తెలిపింది.

రాజ్యాంగ హక్కులను గౌరవిస్తూ నారీశక్తి బిల్లు పరిష్కరణ, రాజ్యాంగబద్ధంగానే ట్రిపుల్ తలాక్ సమస్యకు పరిష్కారం, రాజ్యాంగానికి లోబడే అయోధ్య వివాదానికి చెక్ పెట్టిన వైనం అంటూ వెల్లడించింది. బాబాసాహెబ్ అంబేడ్కర్ మనకు అందించిన భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఉదాత్తమైన విలువలను నిలబెట్టడానికి నా జీవితంలో ప్రతి క్షణం అంకితం చేస్తానని ప్రధాని మోడీ చెప్పిన మాటలను రాష్ట్ర బీజేపీ సోషల్ మీడియా ‘ఎక్స్’‌వేదికగా ట్వీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version