వాస్తు : మెట్ల విషయంలో ఈ తప్పులు చేస్తే ఆర్ధికంగా చాలా కోల్పోతారు..

-

ఇళ్ళు కట్టేటప్పుడు మెట్ల విషయంలో కొందరు తెలిసో తెలియకో తప్పులు చేస్తుంటారు. అయితే వీటివల్ల చాలా రకాల ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మెట్లే కదా అని లైట్ తీసుకొని ఏమవుతుందే అనుకుంటే కచ్చితంగా పొరబడినట్లే. మెట్ల నిర్మాణంలో వాస్తు లోపాలు ఉంటే అది తప్పకుండా కుటుంబ సభ్యుల మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఇళ్ళు కట్టేటప్పుడు మెట్ల విషయంలో ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలి.? లేదంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం..

ఇక వాస్తు నియమాల ప్రకారం ఇంట్లో మెట్లు ఎప్పుడు నైరుతి లేదా వాయువ్య దిశలోనే ఉండాయి. ఇవే మెట్లకు సరైన దిశగా వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఆనందం, శాంతి, పురోగతి ఉండాలంటే కచ్చితంగా ఈ దిశలో మెట్లు ఉండాలని చెబుతున్నారు. ఈశాన్యం దిశలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మెట్లనేవి ఉండకూదు. పొరపాటున ఈశాన్యంలో గనక మెట్లను నిర్మిస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పవని నిపుణులు సూచిస్తున్నారు.అలాగే మెట్లు ఎట్టి పరిస్థితుల్లో బేసి సంఖ్యలో ఉండాలని వాస్తు పండితులు చెబుతున్నారు. అంటే మొత్తం మెట్ల సంఖ్య 5,7,9,13,25 ఇలా ఉండాలని అర్ధం. మెట్ల సంఖ్య ఇలా బేసి సంఖ్యలో ఉంటేనే సంతోషం, ఆర్థిక పురోగతి లభిస్తుందని వాస్తు పండితులు సూచిస్తున్నారు. అయితే ఈ మెట్ల సంఖ్య 17 గా ఉండడం మంచిదని వాస్తు పండితులు చెబుతున్నారు.

కొంతమంది మెట్లను చాలా నిటారుగా నిర్మిస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల వాస్తు దోషం తప్పకుండా ఏర్పడుతుందని అంటున్నారు. ఎందుకంటే మెట్లను పురోగతికి సూచికగా చెబుతుంటారు. కాబట్టి మెట్లు నిటారుగా ఉండడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఇక మెట్లను సవ్య దిశలో ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మెట్లు వక్రమంగా అస్సలు ఉండకూడదు. అలాగే మెట్ల కింద చెప్పులను అస్సలు ఉంచకూడదని చెబుతుంటారు.మెట్లలో ఏవైనా లోపాలు ఉంటే మెట్ల కింద కచ్చితంగా చీకటి లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

ఇంకా అలాగే మెట్ల ప్రారంభం, చివరిలో గ్రీన్‌ కలర్‌లో ఉండే డోర్‌ మ్యాట్‌లను కచ్చితంగా ఉపయోగించాలి. ఎందుకంటే దీనివల్ల ఏవైనా దోషాలు ఉన్నా కానీ అవి తొలగిపోతాయి. ముఖ్యంగా మెట్ల కింద వంట గది నిర్మాణం అస్సలు ఉండకదూడు.చాలా మంది మెట్ల కింద బాత్‌రూమ్‌ను నిర్మించుకుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇది అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఉంటే కచ్చితంగా ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news