నీట్ పరీక్ష పై గత కొద్ది నెలల నుంచి వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. నీట్ పేపర్ లీక్ అయిందని.. పరీక్ష రద్దు జరుగుతుందని కొందరూ.. రద్దు కాదని మరికొందరూ పేర్కొంటుంటే నీట్ పరీక్ష రాసినటువంటి విద్యార్థులు గందరగోళంలో పడ్డారు. తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో కాస్త రిలీప్ అయ్యారు.
నీట్ పరీక్షపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. నీట్ పరీక్షను మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం తేల్చిచెప్పింది. కాపీ కొట్టిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హుజారీబాగ్, పాట్నా లో మాత్రమే పేపర్ లీక్ అయిందని పేర్కొంది. పేపర్ లీక్ వల్ల 155 మందికి మాత్రమే లబ్ధి చేకూరిందని తెలిపింది. దేశమంతా పేపర్ లీకైనట్లు ఆధారాలు లేవని చెప్పింది. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహిస్తే.. దాదాపు 24 లక్షల మందికి పైగా విద్యార్థుల పై ప్రభావం పడుతుందని పేర్కొంది. అందుకే నీట్ పరీక్షను రద్దు చేయడం లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.