బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అనే పదాన్ని నిషేధించిందని సీఎం రేవంత్ అన్నారు. నేను మూడు సార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర అభివృద్దికి సహకరించాలంటూ విజ్ఞప్తి చేసినా వివక్ష చూపిందన్నారు. తెలంగాణ అని పలకడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇష్టపడటం లేదు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియనే మోడీ తప్పు బట్టారు. మూసీ రివర్ ప్రాజెక్ట్ కోసం నిధులు ఇవ్వమని కోరాం. కానీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఈ బడ్జెట్ కుర్చి కా బచావో బడ్జెట్ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మోడీని పెద్దన్నగా భావించాం. కేవలం కిడ్ ప్రో అన్నట్టుగా బడ్జెట్ ఉందని తెలిపారు. బడ్జెట్ పై అసెంబ్లీలో రేపు తీర్మాణం చేసి ప్రధానికి పంపుతామని తెలిపారు. ఆంధ్రప్రదేవ్ కి ఎందుకు ఇచ్చారని మేము అడగడం లేదు. తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నానని తెలిపారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ బానిసలుగా ఆలోచించకూడదు. తెలంగాణ పౌరులుగా ఆలోచించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.