వాస్తు: ఇంట్లో వాహనానికి సంబంధించి తప్పులని అస్సలు చెయ్యద్దు..!

-

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎటువంటి సమస్యలు అయినా సరే తొలగించుకోవచ్చు. పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలు ని చెప్పారు వీటిని కనుక అనుసరిస్తే ఏ బాధ ఉండదు. వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వాస్తు ప్రకారం పార్కింగ్ కి సంబంధించిన విషయాలు కూడా పాటించాలి.

వాస్తు ప్రకారం సరైన దిశ లో ఇంట్లో వాహనాలని ఉంచుకోవడం మంచిది. సరైన దిశ లో వాహనాలని పెడితే ఆనందం మీ సొంతం అవుతుంది. అలానే ధనం కూడా ఉంటుంది ఏ సమస్యలు రావు.
పార్కింగ్ ఏరియా యొక్క స్లోప్ ఎప్పుడూ కూడా ఉత్తర దిశలో ఉండాలి అలానే వాస్తు ప్రకారం ఏదైనా వాహనం ఎప్పుడైనా రిపేర్ అయితే వెంటనే దానిని రిపేర్ చేయించాలి లేకపోతే వాస్తు దోషాలు కలిగే అవకాశం ఉంది.
అలానే మీరు వాస్తు ప్రకారం ఎప్పుడైనా సరే వాహనాన్ని ఎక్కడైనా ఉంచితే ఆ చుట్టూ కూడా స్పేస్ ఉండాలి. చుట్టుపక్కల స్పేస్ ఉండేటట్టు తప్పక చూసుకోండి.
ఈశాన్యం వైపు ఎప్పుడు వాహనాన్ని పెట్టకూడదు. ఈశాన్యం వైపు వాహనం పెట్టడం వలన మానసిక సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలా ఈ విధంగా మీరు వాహనాలకు సంబంధించిన విషయాలు పాటిస్తే ఖచ్చితంగా ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version