వాస్తు: ఈ చెట్టు ఇంట్లో ఉంటే ఇబ్బందులే తెలుసా..?

వాస్తు ప్రకారం అనుసరించడం వల్ల ఎలాంటి సమస్య అయినా తొలగిపోతుంది. అలానే ఇంట్లో ఏ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. అయితే ఈ రోజు మనతో వాస్తు పండితులు కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. వీటిని కనుక అనుసరిస్తే ఇబ్బంది లేకుండా ఆనందంగా ఉండొచ్చు. మరి ఇక పండితులు చెబుతున్న అద్భుతమైన వాస్తు చిట్కాల గురించి చూస్తే..

 

ఇంట్లో సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉండాలని అనుకుంటే ఇంట్లో రావి చెట్టు ఉండకూడదని పండితులు చెప్పడం జరిగింది. రావి చెట్టు వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు అంటున్నారు. అందుకని ఎప్పుడూ కూడా ఇంట్లో రావి చెట్టును ఉంచకూడదు. ఇంట్లో రావి చెట్టు సమస్యలకు దారి తీస్తుంది.

అయితే రావిచెట్టును పూజ చేయొచ్చు. కానీ ఇంట్లో మాత్రం ఉంచడం మంచిది కాదని వాస్తు శాస్త్రం అంటోంది. ఒకవేళ కనుక ఇంట్లో మనకి తెలియకుండా ఆ మొక్క వచ్చిందంటే దాన్ని తొలగించాలి. అంతే కానీ ఇంట్లో ఎప్పుడూ రావి చెట్టుని ఉంచకూడదు. ఇలా రావి చెట్టు ఉండడం వల్ల అది అశుభానికి దారితీస్తుందని.. ఇబ్బందులకి కారణమవుతోందని పండితులు అంటున్నారు. కాబట్టి దీన్ని ఎప్పుడూ కూడా ఇంట్లో వేయొద్దు.