జ‌గ‌న్ పై చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..యేసు ప్రభువు ఏం చెబుతున్నాడు !

ప్రశ్నించే వారి పై దాడుల్ని మీ యేసు ప్రభువు ఆమోదిస్తారా? అలా చేయ‌మ‌ని చెబుతున్నాడా అని సీఎం జ‌గ‌న్ పై చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్టీఆర్ భవన్లో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు చంద్రబాబు. ఈ సంద‌ర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… శత్రువులను కూడా గౌరవించమని బైబిల్ చెప్తుంటే, సొంత పార్టీ కార్యకర్తల్ని కూడా కనికరించని పరిస్థితుల్లో వైసీపీ ఉందని.. తోటి వారిని ప్రేమించాలనే బైబిల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని ఆగ్ర‌హించారు.

chandrababu naidu ys jagan

ఉన్నత ప్రమాణాలు పాటించే క్రైస్తవ విద్యా సంస్థలకు గ్రాంట్ నిలిపేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీదని.. ఎన్టీఆర్ హయాంలో కట్టిన ఇళ్ళకు ఇప్పుడు బలవంతపు వసూళ్లు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం తరఫున సెమీ క్రిస్మస్ వేడుకలకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశమేనని.. తెలుగుదేశం ఉన్నంత వరకూ మత సామరస్యాన్ని కాపాడతామ‌ని వెల్ల‌డించారు. చర్చిలకు తొలిసారి ఆర్ధిక సాయం చేయటంతో పాటు పెళ్లి కానుక, జెరూసలేం యాత్రకు నిధులు, క్రిస్మస్ కానుక లాంటి ఎన్నో పథకాలను టీడీపీ అమలు చేసిందని చెప్పారు.