వాస్తు: ఈశాన్యం వైపు చీకటిగా ఉంచితే ఇబ్బందులు వస్తాయి..!

ఇంట్లో మనకి తరచూ ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాలి. వాస్తు ప్రకారం అనుసరించడం వల్ల ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి. అదే విధంగా ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఆనందంగా ఉండడానికి అవుతుంది. అయితే ఈ రోజు పండితులు మన కోసం కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు.

 

వీటిని కనుక అనుసరిస్తే తప్పకుండా సమస్యల నుండి బయట పడవచ్చు అని పండితులు అంటున్నారు. ఈశాన్యం వైపు చీకటిగా ఉండటం మంచిది కాదని పండితులు చెప్పడం జరిగింది. ఈశాన్యం వైపు కనుక చీకటిగా ఉంటే ఎంత కష్టపడినా దానికి తగ్గ ఫలితం రాదని వాస్తు పండితులు చెపుతున్నారు.

ఈశాన్యం అనేది చాలా ముఖ్యమైనదని.. డబ్బులు రావడానికి ఈశాన్యం ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్తున్నారు. అలానే ఈశాన్యం వైపు చెత్తా చెదారం, బరువైన సామాన్లు ఉంచకూడదు. ఇలాంటివి ఉన్నాయి అంటే ఆర్థిక నష్టాలు కలుగుతాయి. కాబట్టి ఈశాన్యం వైపు ఈ తప్పులు జరగకుండా చూసుకోండి.

అలానే ఈశాన్యం వైపు చీకటిగా కనుక ఉంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి. కాబట్టి ఈశాన్యం వైపు ఎప్పుడూ కూడా వెలుతురు ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా ఈ మార్పులు కనుక మీరు చేశారు అంటే కచ్చితంగా ఏ సమస్య లేకుండా ఉండొచ్చు అలానే ఎంతో ఆనందంగా ఉండొచ్చు.