లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య.. అనుమానంతో ఉపాధ్యాయుడు బలి.. ఏం జరిగిందంటే?

నేను ఎలాంటి తప్పు చేయలేదు. కానీ, విద్యార్థులు నన్ను అనుమానిస్తున్నారు. వారిని ఎదుర్కోలేకపోతున్నాని సూసైడ్ లేఖ రాసి గణిత ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దయచేసి నన్ను క్షమించండి. ఐ మిస్ యూ అల్ అంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న ఉపాధ్యాయుడిని శరవనన్‌‌గా గుర్తించారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్ర తిరుచిరపల్లి జిల్లా కరూర్‌లో చోటుచేసుకుంది.

కరూర్‌లో ప్రైవేట్ స్కూల్ 12వ తరగతి చదవుతున్న 17 ఏండ్ల లైంగిక వేధింపుల కారణంగా సూసైడ్ చేసుకున్నది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే ఉపాధ్యాయుడు శరవనన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇరువురు ఒకే పాఠశాలకు చెందిన వారు. అర్జెంట్ పని ఉన్నదని స్కూల్ నుంచి శరవనన్ వెళ్లిపోయాడు. అక్కడి నుంచి తిరుయార్‌‌లోని తన చిన్నాన్న ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థిని ఆత్మహత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తోటి విద్యార్థులు తనపై అనుమానం వ్యక్తం చేస్తుండటంతో ప్రాణాలు తీసుకుంటున్నానని సూసైడ్‌ నోట్‌లో శరవనన్ పేర్కొన్నాడు.