వాస్తు: దీపాలను ఇలా పెడితే సమస్యలు దూరం..!

వాస్తుని అనుసరిస్తే ఎలాంటి సమస్యలనైనా తొలగించుకోవచ్చు. వాస్తు ప్రకారం ఫాలో అయితే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. పైగా అనారోగ్య సమస్యలు ఇంట్లో ఎవరికైనా ఉంటే కూడా వాస్తుని అనుసరించడం మంచిది. దీని వల్ల మంచి కలుగుతుంది. అయితే మనం ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటాము. పూజను చేసేటప్పుడు దీపారాధన చేస్తూ ఉంటాము.

 

దీపారాధన చేస్తే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ కలగాలంటే ఇలా దీపారాధన చేయాలని వాస్తు పండితులు అంటున్నారు. అష్టలక్ష్మి గురించి మనకి తెలిసినదే. అష్ట లక్ష్మి అంటే ఆది, ధాన్య, వీర, గజ, సంతాన, విద్య, విజయ, ధనలక్ష్ములనే అష్టలక్ష్మిలు అంటారు. అష్టలక్ష్మిలు ఉన్న కలిశం ని కానీ కుందులని కానీ మనం పూజల్లో వాడుతూ ఉంటాము.

అయితే ఇలా లక్ష్ములు ఉన్న కుండలను ఉపయోగిస్తే చాలా మంచిదని పండితులు అంటున్నారు. ధనం కలుగుతుందని.. జ్ఞానం పెరుగుతుందని.. జీవితంలో ఉత్తమ మార్గాన్ని చేరొచ్చని.. అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెప్తున్నారు. కాబట్టి దీపం పెట్టేటప్పుడు ఇటువంటి కుందులను ఎంపిక చేసుకోండి. అలానే పాజిటివ్ ఎనర్జీ కలిపి నెగిటివ్ ఎనర్జీ దూరం అవ్వాలంటే ఇంట్లో సాంబ్రాణి పొగ వేయండి దీని వలన కూడా మంచి కలుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మంచి కలగాలంటే ఇంట్లో పటికను కూడా పెట్టండి కావాలనుకుంటే మీరు ఆఫీసులో షాపుల్లో కూడా పెట్టుకోవచ్చు.