వాస్తు: వంటింట్లో ఈ మార్పులు చేస్తే ఆర్ధిక సమస్యలు వుండవు..!

వాస్తుని అనుసరించడం వల్ల ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం ఫాలో అయితే ఖచ్చితంగా ఇంట్లో ఏ ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉండడానికి అవుతుంది. ఈరోజు వాస్తు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. వీటిని కనుక ఫాలో అయితే సమస్యలు ఏమి లేకుండా ఉండచ్చు. వంటింట్లో ఎలాంటి చిట్కాలని పాటిస్తే మంచిది అనే దానిని చెప్పారు.

 

మీరు మీ వంట గదిలో ఈ చిట్కాలను కనుక పాటించారంటే ఏ ఇబ్బందులు ఉండవు. అయితే మరి పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాల గురించి చూసేద్దాం. మీ వంట గది లో ఎప్పుడూ కూడా రంగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

వంట గది లో రంగులు ఏమి వేస్తే మంచిది అనేది చూస్తే… ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే వాటిని చూసుకోవాలి. వంట గది లో తెలుపు రంగు లేదా క్రీమ్ కలర్ పెయింట్ వేయించుకుంటే మంచిది. ఇది వాస్తు దోషాలను తొలగిస్తుంది.

అలానే పాజిటివ్ ఎనర్జీని తీసుకు వస్తుంది. ఒకవేళ వాస్తు దోషాలు ఉంటే ఎరుపు రంగు కూడా పెయింట్ వేయించుకోవడం మంచిది. అలానే ఇవే కాకుండా గులాబీ రంగు, పసుపు, ఆరెంజ్, చాక్లెట్ కలర్ కూడా వంట గదిలో వేయించుకో వచ్చు.