బూస్టర్ డోస్ తీసుకుంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి…!

-

కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో సమస్యలను మనం ఎదుర్కోవలసి వస్తోంది. ఇప్పుడు మరోసారి మూడో వేవ్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడు బూస్టర్ డోస్ ఇస్తున్నారు. అయితే బూస్టర్ డోస్  తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి..?, ఆ సైడ్ ఎఫెక్ట్స్ నుండి ఎలా బయటపడాలి అనేది చూద్దాం.

ఒమీక్రాన్ కారణంగా ఎన్నో సమస్యలు ఇప్పుడు అందరిలో చూస్తున్నాం. కనుక వీలైనంత వరకు ఒమీక్రాన్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి. సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్క్ ధరించడం లాంటి కనీస నియమాలను పాటించాలి.

బూస్టర్ డోస్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్:

బూస్టర్ డోస్ వల్ల సాధారణంగా జ్వరం, తలనొప్పి, నీరసం, నొప్పి, ఇంజెక్షన్ చేసిన ప్రాంతంలో నొప్పి కలగడం లాంటివి కనబడతాయి.
ఇటువంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కలిగినప్పుడు కంగారు పడక్కర్లేదు. అవి ఆటోమేటిక్ గా తగ్గిపోతూ ఉంటాయి.

బూస్టర్ డోస్ తీసుకోవడానికి వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

తక్కువగా తినండి.
అదే విధంగా ఎక్కువ నీళ్లు తాగండి. హైడ్రేషన్ అనేది చాలా ముఖ్యం.
అలాగే ఆరోగ్యం బాగుండాలంటే మంచి ప్రోటీన్స్ కూడా తీసుకోవాలి.
రోజుకు 5 నుండి 8 సార్లు పండ్లు, కూరగాయలు తీసుకోండి.
ప్రోబయోటిక్స్ ఫుడ్ తీసుకోండి.
పప్పులు వంటివి ఆహారంలో ఎక్కువగా ఉండేట్లు చూసుకోండి.
ఆల్కహాల్, స్మోకింగ్ కి దూరంగా ఉండండి.
ఇలా చేయడం వల్ల ఇమ్యూనిటీ బాగుంటుంది. ఎటువంటి రిస్క్ ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news