పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా, వాళ్లకి సమస్యలు రాకుండా ఉండాలన్నా వాస్తు చిట్కాలు పాటిస్తే మంచిది. వాస్తు ప్రకారం అనుసరించడం వల్ల ఇబ్బందులు తొలగిపోతాయి. అయితే ఈ రోజు పండితులు మన కోసం కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పడం జరిగింది. వీటిని కనుక ఫాలో అయితే ఖచ్చితంగా సమస్యలు ఉండవు.
వాస్తు శాస్త్రం ప్రకారం పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలంటే ఇంట్లో వాస్తు దోషాలు అస్సలు ఉండకూడదు. ఇంట్లో మంచి లైటింగ్, వెల్తురు బాగా ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలానే నెగిటివ్ ప్రభావం పూర్తిగా దూరం అయిపోతుంది. సరైన వెలుతురు, గాలి లేకపోవడం వల్ల తలనొప్పి, కంటి సమస్యలు వస్తాయి. అదే విధంగా పిల్లల గది ఎప్పుడూ ఈశాన్యం వైపు ఉండాలి.
ఈశాన్యం వైపు ఉండటంవల్ల చక్కటి ఫలితాలనే పిల్లలు పొందుతారు. కొత్త వాటిని నేర్చుకోవడానికి కూడా అవుతుంది. ఏకాగ్రత కూడా ఇంప్రూవ్ అవుతుంది. అదే విధంగా పిల్లలు గదిలో ఫర్నిచర్ ఎక్కువగా ఉండకూడదు. తక్కువ ఫర్నిచర్ ఉండాలి.
పిల్లల గదిలో ఉదయిస్తున్న సూర్యుడి పెయింట్ వేస్తే పాజిటివ్ థింకింగ్ కలుగుతుంది. ఇల్లు శుభ్రంగా ఉంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి పిల్లల గదిలో ఎప్పటికప్పుడు శుభ్రం చేయండి. ఇలా ఈ విధంగా పిల్లల మార్పులు చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. అలానే ఇబ్బందులు తగ్గుతాయి.