ప్రస్తుత రోజుల్లో పెట్రోల్ డిజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహానాల దృష్టి పెడుతున్నారు. ఈ విషయాన్ని విహాన తయారి దారి సంస్థలు కూడా ఉపయోగించు కుంటున్నాయి. వరుసగా ఎలక్ట్రిక్ వాహానాలను విడుదల చేస్తున్నాయి. తాజాగా జర్మనీ కార్ల కంపెనీ వోక్స్ వ్యాగన్ నుంచి సరి కొత్త ఎలక్ట్రిక్ కార్ విడుదల చేసింది.
దాని పేరు వోక్స్ వ్యాగన్ ఐడీ. 5. ఈ కారు అతి తక్కువ సమయంలో చార్జ్ అయి ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. అలాగే ఎక్కువ స్పీడ్ తో కూడా వెళ్తుంది. కాగ ఈ కారు మూడు రకాలుగా అందుబాటు లోకి రానున్నాయి. వోక్స్ వ్యాగన్ ఐడీ.5, ప్రో పెర్ఫార్మెన్స్, జీటిఎక్స్. ఈ మూడు వేరియంట్లలో కారు అందుబాటు లో ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఐడీ. 5 కారు 77 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీతో వస్తుంది. ప్రో, ప్రో పెర్ఫార్మెన్స్ వేరియెంట్లు రియర్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్లతో వస్తున్నాయి. అలాగే ప్రో, ప్రో పెర్ఫార్మెన్స్ కార్లు గంటకు 160 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో వెళ్తుంది. ఈ కార్లు ఒకసారి ఛార్జ్ చేస్తే 520 కిలోమీటర్లు వెల్లగలదని వోక్స్ వ్యాగన్ సంస్థ తెలిపింది. ఐడీ 5 ప్రో కూడా 10.4 సెకండ్లలోనే 96 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అలాగే ప్రో పెర్ఫార్మెన్స్ 8.4 సెకన్లలోనే 96 కిలోమీటర్లవేగాన్ని అందుకోంటుంది. ఐడీ 5 జీటీఎక్స్ కారు 96 కిలో మీటర్ల వేగాన్ని కేవలం 6.3 సెకండ్లలో నే అందుకుంటుంది. అయితే ఈ మూడు వెరియంట్ల కార్లు 2022 వరకు మార్కెట్లోకి వస్తాయని వోక్స్ వ్యాగన్ సంస్థ తెలిపింది.