వివాహం లో ఒడి బియ్యం ని పోయడాన్ని మీరు చాలా సార్లు చూసే ఉంటారు కానీ దాని వెనుక కారణం మీకు తెలియక పోవచ్చు. ఆ విషయాన్ని ఈరోజు చూద్దాం. నిజానికి మన హిందూ సాంప్రదాయ ప్రకారం జరిగే పెళ్లిళ్ల లో వివిధ ఆచారాలను పద్ధతుల్ని ఆచరిస్తూ ఉంటారు. దాదాపు చాలా సంప్రదాయాలు పట్ల గౌరవంగా ఉండి ప్రజలు వాటిని అనుసరిస్తున్నారు.
జీలకర్ర బెల్లం మొదలు ఎన్నో పద్ధతుల్ని ఇప్పటికి కూడా మనం పాటిస్తున్నాము. వాటిలో ఒడి బియ్యం ఒకటి. పెళ్లి జరిగిన తర్వాత పుట్టింటి వాళ్ళు కూతురిని కి అప్పుడప్పుడు ఒడి బియ్యం పోస్తూ ఉంటారు. ప్రతి ఏడది కూడా ఇంటికి కూతుర్ని పిలిచి తల్లిదండ్రులు స్తొమత కి తగ్గట్టు బట్టలు పెట్టి ఒడి బియ్యం పోస్తారు.
అసలు ఎందుకు అలా చేస్తారు దాని వెనుక కారణాన్ని పండితులు వివరించారు. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి శరీరం లో నాడులు కలిసే ప్రతి చోటా కూడా చక్రం అనేది ఉంటుంది. మానవ శరీరంలో ఈ విధంగా ఏడు చక్రాలు ఉంటాయి. ఏడు చక్రాలలో గౌరీదేవి ఏడు రూపాల్లో ఉంటుంది. ఒకటి మణిపుర చక్రం నాభి వద్ద ఉంటుంది ఈ మణిపుర చక్రంలోని మధ్య భాగంలో పీఠం ఉంటుంది.
ఈ పీఠం లో ఉండే శక్తిని మహాలక్ష్మి గా భావిస్తారు. పెళ్లి అయ్యాక ఆడపిల్లలకు ఒడి బియ్యం సమర్పించడం అంటే ఆ పీఠం లో ఉన్న మహాలక్ష్మి కి బియ్యాన్ని సమర్పించడం ఇంటికి మహాలక్ష్మి గా భావించి పెళ్లి తర్వాత ఒడిబియ్యాన్ని పోస్తారు. కూతుర్ని ఆ సమయంలో మహాలక్ష్మి గా భావిస్తారు ఆమె భర్తని విష్ణుమూర్తిగా భావిస్తారు.