ఆషాఢ మాసం లో అత్తా కోడళ్ళు ఒకేచోట ఎందుకు వుండకూడదు..

-

తెలుగు మాసాల్లో నాలుగువ మాసం ఆషాఢ మాసం. ఈ మాసం ఎన్నో మహిమలను సొంతం చేసుకుని పుణ్య ఫలాలను ప్రసరించే మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు పూర్వాషాడ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉంటాడు. కనుక ఈ మాసానికి ఆషాడమాసం అనే పేరు వచ్చింది.

శుక్ల పక్ష షష్టి నాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే ఆయురారోగ్యాలు అభివృద్ధి అవుతాయి. అనుకున్నవి జరుగుతాయి అని పండితులు చెబుతున్నారు. అయితే ఇది ఇలా ఉంటే ఆషాడ మాసంలో అత్తా కోడలు ఒకేచోట ఎందుకు ఉండకూడదు అనేది చూస్తే..

వివాహమైన తర్వాత వచ్చే తొలి ఆషాఢమాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడలు మరియు అత్త గారు ఒకే చోట కలిసి ఉండరాదు అనే విషయం మనకి తెలుసు. అయితే ఎందుకు ఉండకూడదు అనేది చూస్తే..

పెళ్లి అయిన తొలి ఆషాడ మాసం లో అత్తా కోడలు ఒకే గడప దాటకూడదు. సామాజికంగా చారిత్రకంగా పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయని తెలుస్తోంది. ఆషాడ మాసంలో భార్య భర్తలు కలిసి ఉంటే గర్భం ధరించి బిడ్డ పుట్టే వరకు చైత్ర వైశాఖ మాసం వస్తుంది..

ఎండాకాలం అప్పుడు ప్రారంభం అవుతుంది. ఈ తీవ్రమైన ఎండలకు బాలింతలు, పసిపాపలు తట్టుకోలేరని పూర్వీకులు ఈ నియమాన్ని పెట్టడం జరిగింది. ఇలా ఈ కారణం చేత అత్తా కోడలు ఒకే చోట ఉండకూడదని చెప్పారని పండితులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news