తెలంగాణ రాష్ట్ర పండగ అయిన బోనాలు ఈ రోజు మొదలు కానున్నాయి. ఆషాడ మాసంలో మొదలయ్యే ఈ పండగ, నేటి నుండి మొదలవుతుంది. హైదరాబాద్ లో బోనాల పండగ పెద్ద ఎత్తున జరుగుతుంది. సికింద్రాబాద్, పాతబస్తీ, గోల్కోండ తదితర ప్రాంతాల్లో బోనాల సంబరం అంబరాన్ని అంటుతుంది. బోనాల పండగలో తొలి బోనం గోల్కోండ కోటలో ఎత్తుకుంటారు. ఈ రోజు తెలంగాణ మంత్రులంతా కలిసి ఈ బోనాల పండగలో పాల్గొంటున్నారు.
ఐతే మహమ్మారి పరిస్థితుల వల్ల బోనాల పండగను హంగూ ఆర్భాల్లేకుండా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఏడాది లానే ఈ సారి కూడా ఎక్కువ హంగులు లేకుండా జరపాలని అనుకుంటున్నారు. కరోనా మూడవ వేవ్ భయాలు వెంటాడుతున్న నేపథ్యంలో అనేక జాగ్రత్తల నడుమ పండగ నిర్వహిస్తున్నారు. ఈ రోజు మొదలైన పండగ, ఆషాడం పూర్తయ్యేదాకా ఉంటుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రోజు పండగ జరుపుకుంటారు.