రేవంత్ రెడ్డి అహంకారంతో వ్యవహరిస్తున్నారు : ఎంపీ ఈటల

-

లగచర్ల రైతులు తమ భూములు ఇవ్వమని అంటున్నా.. వారిని భయపెడుతున్నారు అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. అనేక సంవత్సరాలు గా అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రేవంత్ రెడ్డి అహంకారం తో వ్యవహరిస్తున్నారు. లగచర్ల ప్రజలపై దాడులు చేశారు.. యుద్ధ భూమిగా రేవంత్ రెడ్డి చేశారు. Dk అరుణ అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కానీ రేవంత్ రెడ్డీ సోదరుడిని మాత్రం 50 వాహనాల కాన్వాయ్ తో పంపించారు. రేవంత్ రెడ్డి సోదరుడిని కలెక్టర్ బయటకు వచ్చి లోపలికి తీసుకెళ్లారు. Dk అరుణకు కనీస మర్యాద కూడా ఇవ్వలేదు. ముచ్చర్ల లో 14 వేల ఎకరాలు బలవంతంగా సేకరించారు. ఆ భూముల్ని ఫోర్త్ సిటీ పేరు తో రియల్ ఎస్టేట్ గా మార్చాలని ప్రభుత్వం చూస్తుంది. రేవంత్ రెడ్డి కళ్ళు నెత్తికెక్కాయి.

మీ భూముల జోలికి వస్తె తన్ని తరమండి అని గతంలో రేవంత్ మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ నేతలు కూడా ఫోన్ లలో మాట్లాడారు. ప్రైవేట్ కంపెనీలు భూములు కొనుక్కోలేవా… ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి… బ్రోకర్ లా అని ప్రశ్నించిన ఈయన.. గత ప్రభుత్వం కూడా దళితుల, పేదల భూములు గుంజుకుంది. ఇప్పుడు రేవంత్ కూడా అలానే వ్యవహరిస్తున్నారు. దళిత, గిరిజనులు తగిన సమయంలో బుద్ధి చెబుతారు. అధికారులు చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష అనుభవిస్తారు అని ఎంపీ ఈటల తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version