స్త్రీ యొక్క విశిష్టత

-

ప్రపంచంలో  మతమూదేశమూ ఇవ్వనంత గౌరవంమర్యాదపూజనీయత కేవలం సనాతన ధర్మంలో మాత్రమే స్త్రీకి ఇవ్వబడిందిఅసలు ఇంకా చెప్పాలంటేపురుషునికన్నా స్త్రీనే ఒక మెట్టు ఎక్కువ అని ఎన్నోసార్లు చాటిచెప్పింది  నా ధర్మంనా దేశంనాజాతిఅనాదియైఉన్నతమైన ఎన్నో భావాలు కలిగి ప్రపంచానికి, సంస్కారం నేర్పిన దేశం భారత దేశం .

స్త్రీ మూర్తి వివాహానంతరం భార్యాభర్త ఇద్దరూ సమంఅసలు ఆమెయే ఎక్కువ కూడా వేదాలుశాస్త్రాలుప్రమాణ గ్రంథాలు అలానే చెప్పాయిఆమెయే గృహంఅందుకే ఆమె గృహిణిఆమె ఇంటిలో ఉంటున్నందుకు అతడు గృహస్థుపెళ్ళి అయ్యీ అవ్వగానే వ్యక్తికి సంబంధించిన సమస్తమునకూ ఆమె యజమానురాలుఅదీ మాజాతిఅందుకు భిన్నంగా స్త్రీని ఒక భోగ వస్తువుగా చూడడంఆనక వదిలేయడం అవైదికమూభారతీయతా కానిఅనాగరికులు సంస్కార హీనులైన అన్య జాతులుపాఖండ మతస్తుతల సంప్రదాయం.

నిజానికి సనాతన ధర్మంలోస్త్రీ లేకుండా  మంగళమూ లేదుమన దేశంలో స్త్రీ మూర్తిలేని ఇల్లు గబ్బిలాల కొంప వంటిదని అభిప్రాయంఇంట్లో కళ కళ లాడుతూ స్త్రీమూర్తి తిరుగుతూ దీపం పెట్టిన ఇల్లే దేవాలయంఆమెయే దేవతస్త్రీలేకపోతే మగవానికి గౌరవమే లేదుఎంత గొప్పవాడైనా తన పక్కన భార్యగా స్త్రీలేకపోతే  వైదిక కార్యక్రమమూ చేయలేడుఅసలు సనాతన ధర్మంలో ప్రవర్తిస్తున్న పురుషుడు ఏది చేసినా స్త్రీ గౌరవాన్ని ప్రకటించేదే అయ్యి వుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news